ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానల్ లో మిస్టర్ అండ్ మిసెస్ పేరుతో ఒక ఈవెంట్ ప్రసారం కానుండగా వాలెంటైన్స్ డే సందర్భంగా లవ్ స్టోరీ థీమ్ తో తాజాగా ప్రోమో విడుదలైంది.శ్రీముఖి ఈ షోకు యాంకర్ కాగా స్నేహ, శివ బాలాజీ ఈ షోకు గెస్ట్ లుగా ఉన్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీవాణి, విక్రమ్ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.శ్రీముఖి శ్రీవాణిని లవ్ అంటే ఏంటి అని అడగగా నా దృష్టిలో ప్రేమ అంటే విక్రమ్ అని శ్రీవాణి చెబుతుంది.
ఆ తర్వాత శ్రీముఖి విక్రమ్ ను అదే ప్రశ్న అడగగా విక్రమ్ నా దృష్టిలో ప్రేమ అంటే కూడా విక్రమే అంటూ అదిరిపోయే పంచ్ వేశారు.ఆ తర్వాత సుజాత రాకేశ్ తో కొబ్బరిచిప్పల కోసం కోతి ఏ విధంగా ఎదురుచూస్తుందో రాకేశ్ ప్రేమ కోసం నేను అదే విధంగా ఎదురుచూస్తున్నానని కామెంట్ చేశారు.
రాకేశ్ వెంటనే అక్కడ కూడా నువ్వు కోతి అని ఒప్పుకున్నావ్ కదనే అంటూ సుజాత పరువు తీసేశారు.ఆ తర్వాత రాకేశ్ ఒక రచయితకు ఫీల్ రావాలంటే ఎలాగైనా కూర్చోవచ్చని చెప్పగా శ్రీముఖి వెంటనే ఎవడ్రా రచయిత అంటూ రాకేశ్ పరువు తీసేశారు.ఆ తర్వాత విక్రమ్ షోలో మాట్లాడుతూ దేవుడిని నిజంగా మనస్పూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే నీకంటే వన్ డే ముందు అయినా నేను చనిపోవాలని కోరుకుంటున్నానని అన్నారు.
నేను ఉండగా నువ్వు చనిపోతే కచ్చితంగా గంటసేపు కూడా ఏం చేయాలో నాకు తెలియదని విక్రమ్ అన్నారు.ఐ లవ్ యూ పండు అని విక్రమ్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత సుజాత తన నిశ్చితార్థం గురించి వార్తల్లో చెబుతూ రాకింగ్ రాకేశ్ సుజాత లగ్గం ఫిక్స్ అయిందని రాకింగ్ రాకేశ్ కు కష్టపడే రోజులు ముందున్నాయని ఆమె కామెంట్ చేశారు.