ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పోసాని ప్రస్తుతం నటుడిగా బిజీ కాకపోయినా వైసీపీ నేతగా బిజీగా ఉన్నారు.
ఎంతోమంది టాలెంటెడ్ నటులను ప్రోత్సహించిన ఘనత పోసాని సొంతమని చెప్పవచ్చు.రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా పోసాని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారని సమాచారం అందుతోంది.
అయితే పోసాని కృష్ణమురళి కుటుంబం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు.పోసాని కృష్ణమురళి తన తండ్రి గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారని పోసాని కృష్ణమురళి తెలిపారు.మా నాన్నకు మొదట ఎలాంటి చెడు అలవాట్లు లేవని అయితే మా నాన్నకు ఎవరో పేకాట నేర్పారని పోసాని చెప్పుకొచ్చారు.
ఊళ్లో ఎవరో ఒకరు ఎందుకు సుబ్బారావు ఈ విధంగా చేస్తావు కదా అని అడుగుతారని అలా అడగటం వల్ల ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకోలేకపోయారని నాన్న పొలానికి వెళ్లి చనిపోయారని పోసాని వెల్లడించారు.పోసాని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎప్పుడూ నవ్వుతూ ఉండే పోసాని నవ్వుల వెనుక ఇంత బాధ ఉందని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
పోసాని మళ్లీ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పోసాని రెమ్యునరేషన్ ప్రస్తుతం రోజుకు 2 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంది.ఎన్నో సినిమాల సక్సెస్ లో పోసాని కీలక పాత్ర పోషించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోసాని పోటీ చేస్తారేమో చూడాలి.ఆ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే పోసానికి సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయని సమాచారం అందుతోంది.
నటుడిగా పోసాని కృష్ణమురళి స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా చిన్న సినిమాలలో మాత్రం పోసాని కృష్ణమురళికి సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.