ఈ మధ్య కాలంలో రోజా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.నాకు ఈ షోకు ఆహ్వానం అందిందని అయితే ఈ షోకు వెళ్లే ఆలోచన నాకు లేదని రోజా పేర్కొన్నారు.
చంద్రబాబు హాజరైన షోకు వెళ్లాలని తనకు లేదని ఆమె చెప్పుకొచ్చారు.ఈ షోపై తనకు ఉన్న అభిప్రాయం పూర్తిస్థాయిలో మారిపోయిందని రోజా కామెంట్లు చేశారు.
అయితే రోజాకు నెటిజన్లు సైతం ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు.ఏ షోకు అయినా సెలబ్రిటీలను పిలవడం కామన్ అని రోజాను పిలిచినంత మాత్రాన ఆమెను ఆ షోకు రావాలని ఎవరూ బలవంత పెట్టరని నెటిజన్లు చెబుతున్నారు.
డబ్బుల కోసం ఈ షో చేస్తున్నారని రోజా కామెంట్ చేస్తున్నారని అయితే ఈ షో ద్వారా కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడం కూడా జరుగుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తన రాజకీయ ప్రయోజనాల కోసం రోజా చిరంజీవి, బాలయ్యల గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.గతంలో రోజా బాలయ్యతో ఒక సందర్భంలో సెల్ఫీ తీసుకున్నారని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.రోజా చేసిన టీవీ షోలు, ఈవెంట్ల కంటే అన్ స్టాపబుల్ షో చీపా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
రోజా గతంలో జబర్దస్త్ షో నుంచి బాలయ్యకు కాల్ చేసి జబర్దస్త్ షోకు ఆహ్వానించారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
ఆ సమయంలో బాలయ్య హుందాగా స్పందించారని రోజా మాత్రం అన్ స్టాపబుల్ షో గురించి నెగిటివ్ ప్రచారం జరిగేలా చెబుతున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.తన కామెంట్ల ద్వారా రోజా అభిమానించే వాళ్లను కూడా దూరం చేసుకుంటున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రోజా పొలిటికల్ కారణాల వల్ల ప్రముఖులను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది చెబుతున్నారు.