వైరల్: అందం, అభినయం కలగలసిన వీడియో... డాన్స్ ఇరగదీసిన అమ్మాయిలు!

అల్లువారి వారసుడు అల్లు అర్జున్‌ ఏ ముహూర్తాన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’ సినిమా చేసాడో గాని ఆ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా స్థాయిలో ఒక ఊపు ఊపేసింది.ఇంకేముంది….దాంతో బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా రాలడమే కాకుండా ఓ కల్ట్ క్లాసిక్ సినిమా అయింది.సినిమానే ఒకెత్తయితే అందులోని పాటల ఇంకొకెత్తు అని అనుకోవాలి.మరీ ముఖ్యంగా ఆ సినిమాలో ‘ఊ అంటావా మావా.ఊఊ అంటావా మావా.

 A Video Of Beauty And Acting Dancing Girls , Women Dance Viral , Dance, Viral-TeluguStop.com

’ అంటూ సమంత వేసిన స్టెప్పులయితే వయస్సులో వున్నవారే కాకుండా ముసలివారిలో కూడా అలజడులు సృష్టించాయి.

కాగా ఆ పాట సోషల్ మీడియాలోకూడా ఓ ఊపు ఊపేసింది.

ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలు ఇప్పటికీ మనకి తారసపడుతూ ఉంటాయి అంటే మీరే అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు కూడా తాజాగా ఊ అంటావా మావా పాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే వైరల్ అవుతున్న వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులకు బెల్లీ డ్యాన్స్ కూడా యాడ్ చేశారు.దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లకు మెంటల్ వస్తోంది అంటే మీరు నమ్మి తీరాలి.

kkhushii_sharma అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ అయిన ఈ వీడియోలో.ఊ అంటావా మావా పాటకు ఖుషీ శర్మ డ్యాన్స్ చేయడాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు.ఇక ఆమె డ్యాన్స్ చేసిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.కాగా ఈ వీడియో ఇప్పటివరకు దాదాపు 5 లక్షల 80 వేల వీక్షణలను పొందడమే కాక 58 వేల లైకులను సొంతం చేసుకోవడం ఇక్కడ మీరు చూడవచ్చు.

ఈ క్రమంలో నెటిజన్లు అనేకరాలుగా స్పందిస్తున్నారు.ఒక నెటిజన్ ‘పుష్ప అంటే ఫ్లవర్ కాదు… ఫైర్’ అని ఆ సినిమాలోని డైలాగ్ కామెంట్లలో పెట్టగ… మరో నెటిజన్ ‘మీ అద్భుతమైన డ్యాన్స్‌ను ప్రశంసించడానికి మాటలు లేవు’ అని కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube