టాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరో మినిమమ్ రెండు మూడు భారీ ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని ఉన్నారు.కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు అందరి టైం వృధా అయ్యింది.
దీంతో కరోనా తగ్గగానే ఇప్పుడు అందరు దొరికినన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టుకుంటున్నారు.అయితే ప్రాజెక్టులు ప్రకటించడం అయితే ఫాస్ట్ గా చేస్తున్న స్టార్స్ వాటిని పూర్తి చేయడంలో మాత్రం చాలా అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారు.
మరి ఈ విషయంలోనే ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ముగ్గురు హీరోల మీద ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ ముగ్గురు హీరోలు చేస్తున్న పని వల్ల ఫీల్ అవుతున్నారట.
మరి ఆ హీరోలు ఎవరంటే.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఈ ముగ్గురు హీరోలు అనుసరిస్తున్న తీరుకి ఫ్యాన్స్ కు సైతం చిరాకు వస్తుంది.

మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ కొత్త సినిమా షూట్ స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ పూర్తి చేసారు.కానీ కొన్ని కారణాల వల్ల రెండో షెడ్యూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది అని ప్రకటించిన ఈ డేట్ కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

అలాగే ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.అయితే ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా కూడా ఈయన ఇంకా ఈ సినిమా స్టార్ట్ చేయలేదు.ఇది ఏకంగా 2024లో రిలీజ్ అవుతుంది అని ప్రకటించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు.

ఇంకా పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకుని అఖండమైన విజయం సొంతం చేసుకున్నాడు.అయితే ఈ సినిమా పార్ట్ 2 కూడా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయినా పార్ట్ 2 కొద్దిగా కూడా షూట్ పూర్తి కాలేదు.దీంతో ఈ ముగ్గురి స్టార్ హీరోల ఫ్యాన్స్ హీరోలు అనుసరిస్తున్న తీరుకి ఆనందంగా లేరు.