iPhone 14లో కార్‌ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో 256F పవర్ గుర్తించగల కొత్త సెన్సార్‌లను ఉపయోగిస్తోందన్న విషయాన్ని మీరు కొద్ది రోజుల కిందట వినే వింటారు కదా.అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.

 Do You Know How The Car Crash Detection Feature Works On Iphone 14-TeluguStop.com

అలాంటివారి కొరకే ఈ కధనం.ఇంటర్నల్ హై-డైనమిక్ రేంజ్ గైరోస్కోప్, కొత్త డ్యూయల్-కోర్ యాక్సిలెరోమీటర్ క్రాష్ ద్వారా ప్రెజర్ రికార్డ్ చేస్తుంది.

ఇది వాహనదారుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డేటాను ప్రాసెస్ చేస్తుంది.ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ SOS సర్వీసుతో డివైజ్‌ను కనెక్ట్ చేస్తుందన్నమాట.

క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కొత్తగా ప్రారంభమైన ఆపిల్ వాచ్ సిరీస్ 8, Watch Ultraలో కూడా లాంచ్ అయిన సంగతి మీకు తెలుసా? ఇందులో కూడా అనేక సెన్సార్‌లు ఉంటాయి.ఐఫోన్ 14 యూజర్లు మెడికల్ IDలను కూడా ఫోన్‌లో సెటప్ చేసుకోవచ్చు.

ఫోన్‌ను మెడికల్ ID స్లయిడర్‌ని డిస్‌ప్లే చేసేందుకు అనుమతిస్తుంది.ముందుగా స్పందించేవారికి మెడికల్ అసిస్టెన్స్ యాక్సెస్ అందించడంలో ఇది సాయపడుతుంది.

దాంతో సకాలంలో సదరు వాహనదారుడికి వైద్యం చేయబడుతుంది.నిజంగా ఈ ఫీచర్ అద్భుతం కదూ.

ఇకపోతే ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ SUVలు, ప్యాసింజర్ కార్లు, ట్రక్కులతో సహా అత్యంత సాధారణ వాహనాలలో కూడా సమర్ధవంతంగా పని చేస్తుందని చెబుతుంది.అయితే, మీరు బైక్ ప్రమాదానికి గురైతే ఈ ఫీచర్ పనిచేయకపోవచ్చని గ్రహించండి.ఇకపోతే, కొన్నాళ్లక్రితం ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేసేందుకు ఒక యూట్యూబర్ ఏకంగా తన కారుని యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసినదే.ఈ ఎక్సపెరిమెంట్ లో వెంటనే కారు క్రాష్‌ను గుర్తించిన ఆపిల్ కొత్త ఫీచర్ యాక్టివేట్ కావడం అప్పట్లో చూసాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube