రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెబుతున్న గలాటా గీతూ.. ఆ పార్టీ నుంచేనా?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న గలాటా గీతూపై మొదట్లో నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఆ తర్వాత తన ఆటిట్యూడ్ తో ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.గలాటా గీతూ టాప్5 లో ఉంటారని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 Galata Geetu Royal Political Entry Details Here Goes Viral In Social Media , Ja-TeluguStop.com

అయితే తాజాగా గలాటా గీతూ పాలిటిక్స్ పై ఆసక్తి ఉందని వెల్లడించారు.

ప్రస్తుతం ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని తాను ఇంకా తీసుకోలేదని ఆమె తెలిపారు.

అయితే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి రూలర్ కావాలనే ఆలోచన అయితే ఉందని గలాటా గీతూ చెప్పుకొచ్చారు.అయితే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి.

కుప్పం మినహా 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచిందనే సంగతి తెలిసిందే.

రాయలసీమలో ప్రధానంగా టీడీపీ, వైసీపీలకే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.మరి గీతూ రాయల్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో చూడాల్సి ఉంది.గీతూ రాయల్ కు బిగ్ బాస్ షో ద్వారా భారీ స్థాయిలో ఆదాయం దక్కిందని సమాచారం.

గీతూ రాయల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. గీతూ రాయల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

గీతూ రాయల్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఇతర షోలలో కూడా పాల్గొని సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్తుకుంటున్నారు.గీతూ రాయల్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.

గలాటా గీతూకు సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.గలాటా గీతూ రేంజ్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube