భారతీయ మహిళా శాస్త్రవేత్తకు యూరప్‌లో అరుదైన గౌరవం..!!

ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ (ఈఎంబీవో) యంగ్ ఇన్వెస్టిగేటర్ నెట్‌వర్క్‌లో భారతీయ మహిళా శాస్త్రవేత్త స్థానం సంపాదించారు.అంతేకాదు ఆమె ఐరోపా ఖండంలోనే జీవశాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 Indian Scientist Dr Mahima Swamy Honoured As One Of Europe Top Talents In Biolog-TeluguStop.com

కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన డాక్టర్ మహిమా స్వామి. డూండీ యూనివర్సిటీ అనుబంధ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని ప్రముఖ నిపుణులలో ఒకరు.

ఇక్కడ ఆమె ప్రేగులలో రోగ నిరోధక ప్రతిస్పందనలను పరిశోధించే బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

యూనివర్సిటీలోని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రోటీన్ ఫాస్పోరైలేషన్ అండ్ యుబిక్విటిలేషన్ యూనిట్ (MRC-PPU)లో వున్నారు.

యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్‌లో ప్రస్తుతం 135 మంది సభ్యులు వుండగా, 390 మంది మాజీ సభ్యులు వున్నారు.తాజాగా ప్రకటించిన 23 మంది కొత్త సభ్యుల్లో మహిమా ఒకరు.

దీనిపై ఆమె స్పందిస్తూ.ఈ ప్రతిష్టాత్మక నెట్‌వర్క్‌లో భాగమైనందుకు సంతోషంగా వుందన్నారు.

ఐరోపా వ్యాప్తంగా అత్యాధునిక పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలను కలుసుకున్నందుకు ఆనందంగా వుందని మహిమా అన్నారు.ఈ నెట్‌వర్క్‌లో భాగం కావడం తమ పరిశోధనకు ఎంతో సహాయపడుతుందని ఆమె ఆకాంక్షించారు.

తన ల్యాబ్, తన సలహాదారుల మద్ధతు వల్లే తాను ఇక్కడికి చేరుకోగలిగానని మహిమా అన్నారు.

Telugu Biology, Dr Mahima Swamy, Embo, Europe, Indianscientist, Mahima Swamy, Pr

ఇదిలావుండగా.భారత సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్‌ శ్రీ.కె.నాయర్‌కు జపాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘‘ఓకావా అవార్డ్’’ లభించిన సంగతి తెలిసిందే.కంప్యూటర్ విజన్, కంప్యూటేషనల్ ఇమేజింగ్‌పై చేసిన కృషికి గాను ఆయనను ఈ అవార్డ్ వరించింది.

కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా నాయర్ పనిచేస్తున్నారు.అలాగే కంప్యూటేషనల్ ఇమేజింగ్ అండ్ విజన్ లాబొరేటరీకి నేతృత్వం వహిస్తున్నారు.

ఇక్కడ అధునాతన కంప్యూటర్ విజన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తారు.నాయర్ కంటే ముందు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ రాజ్ రెడ్డి, డాక్టర్ జేకే అగర్వాల్‌లు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube