ఆ విషయంలో భారత్ భాగస్వామ్యం కోరిన దేశం.. ఎందుకంటే..

గత కొన్ని రోజుల క్రితమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడిన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్లో మాట్లాడారు.ఈ సందర్భంగా తమ శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని భరోసాను కల్పించినట్లు సమాచారం.

 India Is The Country That Asked For Its Participation In That Matter.. Because ,-TeluguStop.com

బాధిత ప్రజలకు మానవతా సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.వెంటనే యుద్ధాన్ని విరమించేందుకు రెండు దేశాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

చర్చలు మొదలుపెట్టి వివేదాలని పరిష్కరించుకొని దీర్ఘకాలిక పరిష్కారాలకు బాట వేయాలని సూచించినట్లు సమాచారం.అంతేకాకుండా ఉక్రెయిన్ లో చదువుకుంటూ భారత్ కి తిరిగి వచ్చిన విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగిలా చర్యలు తీసుకోవాల్సిందిగా జెలెన్‌స్కీని ప్రధాని కోరారు.

మన ప్రధానితో జరిగిన సంభాషణ గురించి ట్విట్టర్ మాధ్యమంగా జెలెన్‌స్కీ వెల్లడించారు.తను మోదీ తో ఫోన్లో మాట్లాడాలని జి20 ప్రెసిడెంట్ విజయవంతంగా సాగాలని తను ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

గతంలో తను ఇదే ప్లాట్ ఫామ్ లో శాంతి సూత్రాన్ని ప్రతిపాదించాలని దాని అమలుకు భారత్ మద్దతు ఇస్తుందని తను ఆశిస్తున్నాను చెప్పారు.ఈ విషయంలో తనకు భారత్ భాగ్యస్వామ్యంపై నమ్మకం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఐక్యరాజ్యసమితిలో భారత్ తమకు మద్దతు తెలిపేందుకు సంక్షోభ సమయంలో మానవతా సాయం అందించినందుకు భారత్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.యుద్ధ నేరాలకు బాధ్యులైన వారినీ శిక్షించడం నుంచి రష్యా బలగాలని ఉపసంహరించడం తమ ప్రాథమిక సమగ్రతను పునరుద్దించడం వంటి పది అంశాల శాంతి ప్రణాళికను తను వివరించినట్లు వెల్లడించారు.

Telugu India, International, Pm Modi, Russia, Ukraine, Zelenskyy-Telugu NRI

అయితే ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24 వ తేదీ నుంచి రష్యా దురాక్రమణం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రెండు దేశాల అధ్యక్షులతో ప్రధాని మోది పలు సార్లు ఫోన్లో మాట్లాడారు.చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకొని యుద్ధానికి స్వస్తి పలకాలని ఈరు దేశాల ఆధినేతల్ని సూచిస్తూ వస్తున్నారు.ఒకవైపు జెలెన్‌స్కీ చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలిగేందుకు మొగ్గు చూపుతుంటే రష్యా మాత్రం విజయం సాధించాలనే పట్టు విడవకుండా ఉక్రెయిన్ పై దాడి చేస్తూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube