చలపాయి…బాబాయ్.రేపిస్ట్ క్యారెక్టర్.
ఇలా ఎన్నో పేర్లతో పిలవబడే చలపతి రావు అకాల మరణం చెందడం, కైకాల మరణం జరిగి ఒక్క రోజు కాకపోవడం తో మరో మారు అంతా షాక్ లో మునిగారు.అయితే 1500 వందల సినిమాల్లో నటించిన చలపతి రావు ఎక్కువ విలన్ గ్యాంగ్ లో, ఆ తర్వాత మెయిన్ విలన్ గా మారుతూ వచ్చారు.
ముఖ్యం గా గంభీరమైన గొంతుతో, భారీ కాయం తో ఆయన్ను చూస్తేనే భయపడే వారు.దాదాపు వంద సినిమాల్లో ఆయన రేపిస్ట్ గా కనిపించడం తో మహిళలు అయితే ఆయన్ను చూస్తే పారిపోయే వారు.
ఆయన కళ్ళల్లో విలనిజం ఖచ్చితంగా కనిపించేది.
ఇక మొదట్లో అప్రదాన పాత్రల్లో నటించిన ఆ తర్వాత ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి వచ్చారు.
ఇక నిన్న మొన్నటి వరకు అంతా ఓకే.పిల్లలు బాగానే సెటిల్ అయ్యారు.కొడుకు రవి బాబు దర్శకుడు గా బాగానే ఉన్నాడు.కూతుళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు.అయితే క్రూరమైన విలన్ గా ఉన్న చలపతి ని మాత్రం బాబాయ్ అంటూ అందరూ ముద్దుగా పిలుచుకునే విధంగా మార్చింది మాత్రం మొదట కృష్ణ వంశీ అనే చెప్పాలి.నిన్నే పెల్లాడత సినిమాలో మొదటి సారి నాగార్జున కి తండ్రి పాత్రలో సాప్ట్ గా నటించి అందరికీ దగ్గర అయ్యాడు.
ఆ చిత్రంలో నటి లక్ష్మి తో రొమాన్స్ కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది.అక్కడ ఆయన నటన తీరు, ఎంచుకునే పాత్రలు పద్దతి అన్ని మారిపోయాయి.ఆ తర్వాత వి వి వినాయక్ దర్శకత్వం లో ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి బాబాయ్ గా నటించడం కూడా ఆయన్ని ఇండస్ట్రీ కి బాబాయ్ ని చేసింది.అలా ఆయన ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.
ఇక ఈవివి సినిమాల్లో కూడా ఆయన మంచి సాప్ట్ పాత్రల్లో కనిపించారు.అలా మొత్తానికి చలపతి నీ చాలపాయి గా, బాబాయ్ గా మారిపోయారు.
ఆయన భార్య చిన్నతనంలో చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా లైఫ్ అంతా ఒంటరిగానే ఉన్నారు.