జగన్ మాజీ కావాల్సిందే ! పవన్ రూట్ మ్యాప్ ఇదే ?  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినాదం ఒక్కటే.అదే జగన్ మాజీ సీఎం కావడమే.

 Jagan Should Be Former! Pawan's Route Map Is This,pavan Kalyan, Telugudesam Part-TeluguStop.com

ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఏర్పడకుండా చూడడమే తమ ఏకైక లక్ష్యం అంటూ పదే పదే పవన్ మాట్లాడుతున్నారు.దీనికోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏపీలోని వైసీపీ వ్యతిరేక పార్టీలన్నిటిని కలుపుకుని 2024 ఎన్నికల్లో పోటీకి దిగాలని పవన్ భావిస్తున్నారు.

బిజెపితో పాటు టిడిపిని కలుపుకొని వెళ్తే వైసిపిని అధికారానికి దూరం చేయవచ్చని విషయాన్ని పవన్ గ్రహించారు.అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ పదేపదే పవన్ చెబుతూ వస్తున్నారు.

అయితే ఈ ప్రతిపాదనను బిజెపి తిరస్కరిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిని కలుపుకు వెళ్లేందుకు అంగీకరించడం లేదు.ముఖ్యంగా కేంద్ర బిజెపి పెద్దలు ఈ విషయంలో క్లారిటీతో ఉన్నారు.ఇదే విషయాన్ని పవన్ కు ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.

దీంతో 2024 ఎన్నికల్లో బిజెపి,  జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అంతా భావిస్తుండగా,  పవన్ మాత్రం మరోసారి పరోక్షంగా  కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.బిజెపి లెక్కల ప్రకారం 2024 ఎన్నికల్లో జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రాకపోయినా, వైసిపి అధికారంలోకి వస్తే టిడిపి పూర్తిగా కనుమరుగవుతుందని,  అప్పుడు జనసేన బీజేపీ ఏపీలో బలమైన పార్టీలుగా మారుతాయని, 2029లో కచ్చితంగా జనసేన బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు పవన్ ముఖ్యమంత్రి కావచ్చు అనే విషయాన్ని చెబుతున్న,  పవన్ మాత్రం 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిస్తే … జనసేన 2029 వరకు కొనసాగించడం అన్ని విధాలుగా కష్టమవుతుందని, పార్టీని నడపడం భారం అవుతుంది అనే భావనతో ఉన్నారట.
 

Telugu Amith Sha, Ap Cm, Ap, Bjp Root Map, Bjp Tdp Aliance, Janasena, Modhi, Pav

అందుకే బీజేపీని ఏదో రకంగా ఒప్పించి టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ఆలోచనతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వను  అనే విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు.ఇప్పటి వరకు బిజెపి రూట్ మ్యాప్ కోసం వేచి చూసిన పవన్ , ఆ పార్టీ ఇచ్చిన రూట్ మ్యాప్ నచ్చకపోవడంతోనే బిజెపికే టిడిపి తో పొత్తు అని రూట్ మ్యాప్ ను పవన్ ఇచ్చినట్టుగా అర్దం అవుతోంది.మరి ఈ విషయంలో బిజెపి అగ్ర నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube