హీరో వెంకటేష్ విగ్గు వాడతారా.. ఆయన వాడుతున్న విగ్గు ఖరీదెంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర హీరోల అభిమానాన్ని కూడా గెలుచుకున్న హీరోగా వెంకటేశ్ కు పేరుంది.కలియుగ పాండవులు సినిమా నుంచి ఎఫ్3 సినిమా వరకు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగిన వెంకటేశ్ వరుసగా విజయాలు సాధిస్తున్నా ఒదిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు.

 Shocking Facts About Hero Venkatesh Wig Details Here Goes Viral, Hero Venkates-TeluguStop.com

అయితే హీరో వెంకటేశ్ విగ్గు వాడతారనే సంగతి చాలామందికి తెలియదు.సినిమాల్లో వెంకటేశ్ లుక్ న్యాచురల్ గా ఉండటంతో ఆయన విగ్గు వాడతారని చెప్పినా చాలామంది నమ్మరు.

అయితే వెంకటేశ్ మేకప్ మేన్ రాఘవ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేశ్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.వెంకటేశ్ కు గెటప్ కు తగిన విగ్గు పెడతామని రాఘవ పేర్కొన్నారు.

విగ్గులు విదేశాల నుంచి తెప్పిస్తామని ఒక్కో విగ్గుకు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు.నారప్ప మూవీకి వేరే స్టైల్ విగ్గు ఉపయోగించామని రాఘవ చెప్పుకొచ్చారు.

రానా నాయుడు మూవీకి బాంబేలో విగ్గు చేయించామని ఆయన కామెంట్లు చేశారు.వెంకటేశ్ గారికి జుట్టు పలుచగా ఉందని పాత్ర కోసం విగ్గు పెట్టాల్సి ఉందని రాఘవ అన్నారు.

సినిమాలోని పాత్రలకు అనుగుణంగా విగ్గు పెట్టాలని ఆయన కామెంట్లు చేశారు.నేను అప్ డేట్ అవుతూ ఉంటానని ఆయన వెల్లడించారు.

ఒక్కో విగ్గు 3 నుంచి 4 నెలలు మాత్రమే వాడవచ్చని రాఘవ పేర్కొన్నారు.

బాంబే ఇండస్ట్రీ మన కంటే పెద్దదని అక్కడ పని చేసేవాళ్లకు వేతనాలు ఎక్కువని ఆయన వెల్లడించారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు వాళ్ల పర్సనల్ స్టాఫ్ ను తెచ్చుకుంటున్నారని రాఘవ వెల్లడించారు.ఐ తరహా సినిమాలకు హాలీవుడ్ మేకప్ మేన్స్ అవసరమని ఆయన కామెంట్లు చేశారు.వెంకటేష్ తర్వాత మూవీ శేలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.హిట్2 మూవీ సక్సెస్ తో శేలేష్ కొలనుకు ఈ అవకాశం దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube