సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ గా ఎదిగితే ఇక వారికీ భారీ మొత్తంలో పారితోషికాలు అందుతాయి.ఇక ఆ తర్వాత ఆ రెమ్యునరేషన్స్ ను డబల్ చేసే పనిలో పడతారు స్టార్ హీరోలు.
సినిమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇతర వ్యాపారలలో పెట్టుబడులుగా పెడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే.అయితే సెలెబ్రెటీల్లో ఎక్కువ శాతం రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతుంటారు.
ఇదే సురక్షితం అని వారు భావిస్తారు.
ఆధునిక రోజుల్లో భూమి ధర రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
ముంబై లో బాంద్రా ఎంత కాస్ట్లీ అయిపోయిందో.మన దగ్గర హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలు అంతే కాస్ట్లీ అని చెప్పవచ్చు.
గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి కాస్ట్ లీ ఏరియాల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవించడం చాలా కష్టం.ఇక్కడ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ కోట్లను ఆర్జిస్తున్నారు.
ఇక తాజాగా హైదరాబాద్ వంటి మహా నగరంలో మన స్టార్స్ అంతా భారీ పెట్టుబడులు పెడుతున్నారు.
ముంబైలో బాంద్రా-జుహు-అంథేరీ వంటి ప్రాంతాల్లో బాలీవుడ్ హీరోలు ఎలా వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నారో ఇప్పుడు మన స్టార్స్ కూడా హైదరాబాద్ లో అలానే పెట్టుబడులు పెడుతున్నారు.అయితే గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రదేశాల్లో భారీ ధరలు ఉండడంతో దీనికి వేరే అప్షన్ గా గచ్చిబౌలి నంది హిల్స్ కి సమీపంలో ఉన్న బిఎన్ఆర్ హిల్స్ కనిపిస్తుంది.
ఈ సువిశాలమైన బిఎన్ఆర్ హిల్స్ లో ఇప్పుడు స్టార్స్ అంతా పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నారని సమాచారం.
ఈ ఏరియా నుండి నగరంలోని ప్రధాన ఏరియాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఇక్కడ పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుంది అని స్టార్స్ నమ్ముతున్నారు.దీంతో ఈ ఏరియా మరో బాంద్రా కాబోతుందా అనే సందేహం అందరికి వస్తుంది.ఈ ఏరియాలో రవితేజ, ప్రభాస్, అనిల్ రావిపూడి, వివి వినాయక్, హరీష్ శంకర్, క్రిష్, కొరటాల శివ, రామ్ తాళ్లూరి లాంటి స్టార్స్ పెట్టుబడులు పెడుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.