పండగల సమయంలో ఈ-కామర్స్ సైట్స్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తుంటాయి.దీంతో చాలా మంది ఆ సమయంలో తమకు ఇష్టమైన ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటారు.
ప్రస్తుతం ఆ స్థాయిలో కాకపోయినా, మెరుగైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందజేస్తోంది.
ఐఫోన్ 13, రెడ్‌మి 10 ప్రైమ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22, మరిన్ని ఇతర ఫోన్లు తగ్గింపు ధరలకే విక్రయించబడుతున్నాయి.అయితే ఈ ఆఫర్ నవంబర్ 30తో ముగియనుంది.
ఐఫోన్ 13 రూ.62,999కే కొనుగోలు చేయొచ్చు.128GB స్టోరేజ్ మోడల్‌కు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది.దీని ఎంఆర్‌పీ ధర రూ.69,900.యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రూ.1,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు, దీని వలన రూ.61,999కి ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.నథింగ్ ఫోన్ (1)ను ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ.27,499కి కొనుగోలు చేయొచ్చు.జియోమీ 11 ఐ హైపర్‌ఛార్జ్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 నుండి రూ.24,999కి ధర తగ్గించబడింది.పిక్సెల్ 6ఏ రూ.30,999కి అందుబాటులో ఉంది.దీనిని గతంలో ఫ్లిప్‌కార్ట్ రూ.43,999కి విక్రయించింది.మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ ఇది 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.54,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.దీని అసలు ధర రూ.59,999.దీంతో ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.5,000 తగ్గింపును పొందుతున్నారు.సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ.52,999కి అందుబాటులో ఉంది.ఈ ఫోన్‌లో వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 SoC, మంచి 120Hz AMOLED స్క్రీన్, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
పగటిపూట, తక్కువ వెలుతురులో అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు.