Railway Clerk: వైరల్: ప్రయాణికుడిని మోసం చేసిన రైల్వే క్లర్క్‌... రూ.500 నోటును రూ.20 నోటని మోసం!

ప్రతిరోజూ అనేకమంది ప్రయాణికులు రైల్వే మార్గం గుండా ప్రయాణిస్తుంటారు.అందులో సామాన్యులే ఎక్కువ.

 Viral: The Railway Clerk Who Cheated A Passenger Rs.500 Note Was Cheated By Rs.2-TeluguStop.com

వీరు కూలి పనుల కోసం ఒక చోటినుండి మరొక చోటికి వలస జీవనం పోతూ వుంటారు.వాళ్ళు కూలి పనులు చేసి సంపాదించిన డబ్బులనే వారి అవసరాలకు నిత్యం వాడుతూ అరకొర జీవితం గడుపుతూ వుంటారు.

అలాంటి వారిని మరి ఎలా మోసం చేయాలని అనిపించిందో ఆ రేల్వే క్లర్క్ కి.ఓ ప్రయాణికుడిని దారుణంగా మోసం చేసాడు.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో రైల్వే ఉన్నతాధికారులు ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నారు.

వేలకువేలు జీతం తీసుకున్నవాడికి అలాంటి కక్కుర్తి ఏమిటని అనేకమంది సోషల్ మీడియాలో మంది పడుతున్నారు.

ఇటువంటి మోసాలకు సంబంధించిన అనుభవాలు తమకు చాలాసార్లు ఎదురయ్యాయని ఓ యూజర్ కామెంట్ చేయడం కొసమెరుపు.రైల్ విస్పర్స్ అనే ట్విటర్ యూజర్ శుక్రవారం ఈ దారుణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చాడు.

హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఓ ప్రయాణికుడు గ్వాలియర్ రైలులో ప్రయాణించేందుకు టిక్కెట్ తీసుకోవడం కోసం వెళ్ళాడు.టిక్కెట్ కౌంటర్ వద్దనున్న గుమస్తాకు రూ.500 నోటును ఇచ్చి, సూపర్‌ఫాస్ట్ గ్వాలియర్ రైలుకు టిక్కెట్ ఇవ్వాలని అడిగారు.

అయితే ఆ నోటును తీసుకున్న గుమస్తా కేటుగాడు ఆ ప్రయాణికుడిని ఏమార్చి తన వద్దనున్న రూ.20 నోటును ముందు పెట్టి, ఆ రూ.500 నోటును తన వెనుక జేబులో వేసుకున్నాడు.వెంటనే రూ.20 నోటును ప్రయాణికుడికి చూపిస్తూ, టిక్కెట్ ధర రూ.125 అని, మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరాడు.కాగా ఈ తంతుని వెనకనుండి గమనిస్తున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో బంధించగా ఈ దారుణం వెలుగు చూసింది.

ఈ విషయం రైల్వే సేవ, ఢిల్లీ డివిజన్, నార్తర్న్ రైల్వే దృష్టికి కూడా వెళ్లడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube