నాలుగు నెలల క్రితం దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత ద్రౌపది ముర్ము ఇప్పటివరకు దక్షిణాది పర్యటన చేపట్టలేదు.ఈ క్రమంలో డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు చోట్ల పర్యటించడానికి ఆమె సిద్ధం కావడం జరిగింది.
డిసెంబర్ 4వ తారీఖు తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో జరిగే నౌకదల దినోత్సవంలో ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా.
రాష్ట్రపతితో కలసి విశాఖ సాగర తీరంలో నావికాదళ విన్యాసాలను వీక్షించనున్నారు.
గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలు జరపలేదు.
అయితే ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించడానికి నేవీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.ఈ కార్యక్రమం అనంతరం డిసెంబర్ 5వ తారీఖున విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.
విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు జాతీయ రహదారులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది.
ఒక ఇదే సమయంలో మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ.చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్… రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం జరిగింది.రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ మరియు విజయవాడ నగరాలు పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్ళనున్నాయి.