ఈ మధ్యకాలంలో బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.ఆ బిర్యానీ నుండి వచ్చే ఘుమఘుమలతో అందరికీ నోరూరిపోతుంది.
చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ బిర్యాని తినడానికి ఇష్టపడతారు.అయితే ఈ బిర్యాని పర్ఫెక్ట్ గా వండితేనే అందులో కరెక్టు మసాలా దినుసులు వాడితేనే అది రుచికరంగా ఉంటుంది.
అయితే బిర్యానీకి మరింత రుచికరమైన ఫ్లేవర్ రావడానికి నలుపు, తెలుపు కలిసిన రంగులో ఉన్న ఓ సుగంధ ద్రవ్యం అందులో చాలా అవసరం.దాన్నే దగడపువ్వు అని అంటారు.
దీన్ని ఇంగ్లీష్ లో బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని అంటారు.అయితే ఈ పదార్థాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇది మొక్కల నుంచి వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటారు.
కానీ ఇది మొక్క నుండి రాలేదు.ఎందుకంటే ఇది మొక్క జాతి కాదు.ఇది కూడా పుట్టగొడుగులు లాంటివే.దీన్ని ఫంగస్ లాంటివి అని కూడా అంటారు.
పెద్ద పెద్ద చెట్ల కండరాలపై పెరిగే ఒక రకమైన ఫంగస్ ఇది.మొదట్లో ఇది చెట్టుపై పెరుగుతున్నప్పుడు ఆకుపచ్చ అలాగే తెలుపు రంగులో ఉంటుంది.ఈ ఫంగస్ ను లైకెన్ అని కూడా అంటారు.ఇది చెట్లపైనే కాకుండా రాళ్లపైన కూడా నాచులా పెరుగుతుంది.బిర్యానీలు, మాంసాహార వంటలలో దీన్ని కచ్చితంగా వినియోగిస్తారు.
అధికంగా చెట్టినాడ్ వంటల్లో ఈ పదార్థాన్ని ఎక్కువగా వాడతారు.అయితే దీని ఫ్లేవర్ తెలియాలంటే ముక్కుతో వాసన పిలిస్తే తెలియదు.నోటితో రుచి చూస్తేనే దీని ఫ్లేవర్ మనకు తెలుస్తోంది.
అలాగే వంటల్లో కలిపి వండితేనే రుచి రెట్టింపు అవుతుంది.అయితే ఇది వేడికి ప్రతిస్పందిస్తుంది.
అదేవిధంగా దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.దీన్ని తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది.
ఇది యాంటీ వైరల్, ఆంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంది.అలాగే ఇది ఆహారం మెరుగ్గా జీర్ణం అయ్యేందుకు కూడా సహాయపడుతుంది.