సినిమా రంగంలో పెద్ద హీరో అయినా చిన్న సక్సెస్ లో ఉన్న హీరోకు ఇచ్చే గౌరవం ఫెయిల్యూర్ లో ఉన్న హీరోకు ఇవ్వరు అనే సంగతి తెలిసిందే.టాప్ హీరోలు సైతం ఇందుకు అతీతులు కాదు.1974 సంవత్సరం తర్వాత వరుస ఫ్లాపుల వల్ల కృష్ణ కెరీర్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.భిన్నమైన కథలను ఎంచుకున్నా కాలం కలిసిరాక అపజయాలు ఎదురుకావడం గమనార్హం.
కొంతమంది ఏకంగా కృష్ణ హీరోగా సినిమాలు ఆపేయడం మంచిదని నెగిటివ్ కామెంట్లు చేశారు.
కొందరు నిర్మాతలు కృష్ణకు కనపడకుండా తప్పించుకుని తిరిగారు.
వరుసగా 14 సినిమాలు ఫ్లాప్ కావడంతో కృష్ణతో సినిమాలను తెరకెక్కించాలంటే దర్శకనిర్మాతలు సైతం తెగ టెన్షన్ పడ్డారు.అయితే పాడిపంటలు సినిమాతో వరుస ఫ్లాపులకు బ్రేకులు వేసి కృష్ణ సక్సెస్ ను అందుకున్నారు.
కృష్ణ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తర్వాత దర్శకనిర్మాతలు సైతం ఆయనతో కలిసి పని చేయడానికి క్యూ కట్టారు.
అయితే జరిగిన ఘటనలతో ఎవరు ఎలాంటి వ్యక్తులో అర్థమైన కృష్ణ కష్టాల్లో తనకు అండగా నిలిచిన వాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
గౌతమ్ కృష్ణతో కలిసి నటించాలని కృష్ణ ఆశ పడగా ఆ కోరిక నెరవేరలేదు. మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలలో చూడాలని కృష్ణ భావించగా ఆ ఆశ కూడా తీరలేదు.
ఛత్రపతి శివాజీ పాత్రలో నటించాలని కృష్ణ భావించగా ఈ కోరిక కూడా నెరవేరలేదు.
తెలుగులో కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి షో చేయాలని కృష్ణ భావించగా ఈ కోరికను కూడా ఆయన నెరవేర్చుకోలేకపోయారు.కృష్ణ మరణంతో మహేష్ బాబును ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.మహేష్ బాబుకు వరుస కష్టాలు ఎదురవుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
కృష్ణ మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారు.