Somu veeraju modi: మీరు ఎవరు : పరువు పోగొట్టుకున్న బీజేపీ వీర్రాజు ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు హడావుడి గట్టిగానే చేస్తున్నారు.గతంలో బిజెపి తరఫున యాక్టివ్ గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టిన వారందరినీ పక్కనపెట్టి వీర్రాజు చాలాకాలంగా హైలెట్ అవుతున్నారు.

 Pm Modi Didnot Recognize Ap Bjp Chief Somu Veerraju On Core Committee Meeting De-TeluguStop.com

బిజెపి,  జనసేన పొత్తుల విషయంలో గానీ, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో గాని, బీజేపీ విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో గాని వీర్రాజు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానం పెద్దలకు కూడా సంతృప్తికరంగానే ఉంటూ వస్తుంది.ఇక బిజెపి కేంద్ర ప్రజల వద్ద తనకు ఏ స్థాయిలో పలుకుబడి ఉంది అనే విషయాన్ని ప్రతి దశలోను వీర్రాజు నిరూపించుకుంటూ వస్తున్నారు.

అయితే ఇప్పుడు మాత్రం వీర్రాజు కు పెద్ద అవమానమే జరిగింది.

విశాఖ లో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోది ఏపీకి చెందిన నేతలను గుర్తించలేదు.

దీంతో ఈ సమావేశంలో ఎవరికి వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా ప్రధాని కోరారు.అందరూ అదేవిధంగా పరిచయం చేసుకోగా సోము వీర్రాజు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారట.ఇది గుర్తించిన ప్రధాని సెల్ఫ్ ఇంటర్డ్యూస్ కరో అంటూ మాట్లాడడంతో ప్రధాని గుర్తించలేదని విషయాన్ని వీర్రాజు వెంటనే గ్రహించారు.దీంతో తనను తాను పరిచయం చేసుకున్నారు.

Telugu Ap Bjp, Modhi Visakha, Modi, Prime India, Somu Veeraju, Ysrcp-Political

ఈ సందర్భంగా మీరేమి చేస్తుంటారు అంటూ సోము వీర్రాజును ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా షాక్ అయ్యారట.వీర్రాజు తాను ఏపీ బిజేపి అధ్యక్షుడిని అంటూ చెప్పుకున్నారట.మీరు ఏ వ్యాపారాలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించగా వీర్రాజు ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయారట.ఈ ఊహించని పరిణామంతో బిజెపిలోని సోము వీర్రాజు వ్యతిరేకవర్గం మాత్రం తెగ సంతోష పడిపోయిందట.

ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, అందునా ప్రధాని పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకున్న వీర్రాజు కు ఇది ఊహించని ఎదురుదెబ్బే !?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube