కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ వ్యక్తిగత విషయాలలో బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు.ముఖ్యంగా తమపై తప్పుడు ప్రచారాలు చేసే మాత్రం అస్సలు ఊరుకోరు.
అలా చాలామంది నటీనటులు తమపై తప్పుడు ప్రచారాలు చేసిన మీడియాలపై ఫైర్ అయ్యారు.కొన్ని కొన్ని సార్లు మీడియాలు, వెబ్సైట్లో నటీనటులపై తప్పుడు ప్రచారాలు క్రియేట్ చేసి బాగా వైరల్ చేస్తూ ఉంటారు.
దీంతో ఆ నటీనటులు తమపై లేనిపోని ఆరోపణలు చేయడంతో వాటిపై పరువు నష్టం కూడా వేస్తూ ఉంటారు.అలా తాజాగా ఓ నటి కూడా పలు మీడియాలపై ఫైర్ అయ్యింది.
ఇంతకు ఆమె ఎవరు.ఎందుకు ఫైర్ అయ్యింది.
అసలేం జరిగిందో తెలుసుకుందాం.ఇక ఆ నటి ఎవరో కాదు.
మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పార్వతి నాయర్.
ఈమె మలయాళం తో పాటు తమిళంలో కూడా నటించింది.
ఎన్నై అరిందాల్, నిమిర్నిందు నిల్, ఉత్తమ విలన్, సీత క్కాతి వంటి మరి సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించింది.ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా మీడియా సంస్థపై ఫైర్ అయ్యింది.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.చెన్నైలో నుంగంబాక్కంలో ఈ హీరోయిన్ నివసిస్తుంది.
అయితే ఈ హీరోయిన్ ఇటీవలే తన ఇంట్లో తొమ్మిది లక్షలు విలువైన రెండు వాచీలు.లాప్ టాప్, సెల్ ఫోన్ వంటి వస్తువులు దొంగతనం జరిగినట్లు తెలిపింది.అంతేకాకుండా తన ఇంట్లో పని చేసే వ్యక్తి కూడా కనిపించడం లేదు అని పోలీసులకు తెలిపింది.దీంతో పోలీసులు ఈ విషయం గురించి కేసు నమోదు చేసుకున్నారు.ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు.
ఇక ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి.
ఇక ఆ వార్తలు బాగా వైరల్ అవ్వటంతో.వెంటనే తన ఇంట్లో పని చేసి మానేసిన చంద్రబోస్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఆ హీరోయిన్ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు.
అంతేకాకుండా ఆమెపై తీవ్ర విమర్శలు చేశాడు.ఆమె ఇంట్లో రాత్రి వరకు మగ స్నేహితులతో మందు పార్టీలు చేసుకుంటుందని కొన్ని నిజాలు బయట పెట్టాడు.
ఇక ఈ విషయం తను గమనించడంతో తనపై కించపరిచే విధంగా ప్రవర్తించింది అని అన్నాడు.ఇక అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ చేశారు కొన్ని మీడియా సంస్థలు.దీంతో నటి పార్వతి. తనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తే తన ఇమేజ్ డామేజ్ చేసే చర్యలకు పాల్పడిందని బాగా ఫైర్ అయింది.అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ప్రసారం చేస్తే ఆ సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటాను అంటూ.అంతేకాకుండా పరువు నష్టం దావా చేస్తానని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.