Dallas Airshow : డల్లాస్ ఎయిర్‌షోలో అపశృతి : గాల్లో ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. ఆరుగురి మృతి

అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించిన ఎయిర్‌షోలో విషాదం చోటు చేసుకుంది.రెండు విమానాలు ప్రమాదవశాత్తూ గాల్లోనే ఢీకొట్టుకున్నాయి.

 Six Killed After Military Planes Collide Midair At Dallas Airshow In Us,dallas,a-TeluguStop.com

ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఎయిర్‌షో సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బోయింగ్ బీ- 17 బాంబర్, బెల్ పీ- 63 కింగ్ కోబ్రా విమానాలు భూమికి తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి.

అయితే ఇవి రెండు అత్యంత సమీపంలోకి వచ్చి ఢీకొట్టుకున్నాయి.ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి వుండొచ్చని.

షో చూడటానికి వచ్చిన వారిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

అయితే ప్రమాదానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దానిని బట్టి.

ఎయిర్‌షో సందర్భంగా ఒకే సమయంలో అనేక విమానాలు ఎగురుతూ కనిపించాయి.అక్కడి మైక్‌లో ఓ వ్యక్తి విమానాల గురించి చెబుతూ వున్నాడు.

బీ 17 విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతోందని.ఏం జరుగుతుందో తెలిసే లోపు ఒక విమానం రెక్క , ఆ వెంటనే ఓ అగ్నిగోళం నేలపై పడిందని వారు చెబుతున్నారు.

ఘటనపై ది ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.

Telugu Air, Bomber, Dallas, Eric Johnson-Telugu NRI

మరోవైపు.డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ ఈ ఘటనపై స్పందించారు.ప్రమాదానికి సంబంధించిన వీడియోలు హృదయ విదారకంగా వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ , స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని ఎరిక్ జాన్సన్ పేర్కొన్నారు.

కాగా.

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయంలో బీ- 17 బాంబర్లు కీలక పాత్ర పోషించాయి.కింగ్ కోబ్రా అమెరికాకు చెందిన యుద్ద విమానమే అయినప్పటికీ .నాటి యుద్ధంలో సోవియట్ సేనలు ఎక్కువగా వినియోగించాయి.యుద్ధం ముగిసిన తర్వాత బీ- 17 బాంబర్లను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది.

ప్రస్తుతం వాటిని మ్యూజియంలు, ఎయిర్‌షోలలో మాత్రమే చూడగలం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube