Ireland : ఐర్లాండ్‌లో భారత సంతతి ఫాదర్‌పై హత్యాయత్నం.. గోడ దూకి కత్తితో దాడి

ఐర్లాండ్‌లో ఓ భారత సంతతికి చెందిన ఫాదర్‌ తన నివాసంలోనే హత్యాయత్నానికి గురయ్యాడు.ఆయన ముఖం, తల, వీపుపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు ఆగంతకుడు.

 Indian-origin Priest Stabbed By Intruder At His Ireland Residence , Father Bobbi-TeluguStop.com

ఆర్డ్‌కీన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్ వాటర్ ఫోర్డ్ సమీపంలోని చాప్లిన్ హౌస్‌లో అక్టోబర్ 30న ఫాదర్ బోబిట్ అగస్తీ (30)పై 22 ఏళ్ల ఆంథోనీ స్వీనీ దాడి చేసినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.క్రిమినల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 3 కింద .స్వీనీపై పోలీసులు అభియోగాలు మోపారు.

తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఐర్లాండ్‌లో నివసిస్తున్న బోబిట్…ఆసుపత్రిలో పనిచేస్తూ అక్కడ ప్రార్ధనా మందిరాన్ని నడుపుతున్నాడు.

ఆగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఫాదర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఇంట్లో కోలుకుంటున్నాడు.అయితే నిందితుడైన స్వీనీ యూనివర్సిటీ హాస్పిటల్ వాటర్‌ఫోర్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకియాట్రీ గోడ దూకి చాప్లిన్ హౌస్‌లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.

Telugu Detectivegarda, Bobbit Augusti, Indianorigin-Telugu NRI

ఇంట్లోకి వెళ్లగానే.వంటగదిలోంచి కత్తిని తీసుకుని పై అంతస్తులోకి వెళ్లాడని స్థానిక మీడియా తెలిపింది.ఈ క్రమంలో అప్పుడే వాష్‌రూమ్ నుంచి వస్తున్న ఫాదర్ బోబిట్‌కు అతను తారసపడ్డాడని.

ఆయన తెరుకునేలోపు ముఖం, తల, వెనుక భాగంలో ఆరుసార్లు కత్తితో దాడి చేశాడు.అక్టోబర్ 30వ తేదీ ఉదయం 9.16 గంటలకు ఈ ఘటన జరిగిందని.దీనికి సంబంధించి సీసీటీ ఫుటేజ్‌ స్వాధీనం చేసుకున్నట్లు డిటెక్టివ్ గార్డా హార్టీ మీడియాకు వివరించారు.

దాడి అనంతరం స్వీనీ రెండు నిమిషాల తర్వాత ఆ ప్రాంతం నుంచి పారిపోయాడని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube