నాగచైతన్య సమంత టాలీవుడ్ క్యూట్ జోడీలలో ఒక జోడీ కాగా చైతన్య, సమంత విడిపోయిన తర్వాత వాళ్లిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు.అయితే సమంతతో విడాకులు తీసుకున్నా చైతన్య ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా సమంత గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసిన సందర్భాలు అయితే లేవనే సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం సమంత ఆరోగ్యం అస్సలు బాలేదు.సమంత త్వరగా కోలుకోవాలని లక్షల సంఖ్యలో ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
సమంత ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడిందని తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో ఫీలవుతున్నారు.మరోవైపు నాగచైతన్య సమంత ఆరోగ్యం గురించి స్పందించకపోవడం గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే నాగార్జున, నాగచైతన్య సమంతను కలిసి ధైర్యం చెప్పారని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అయితే చైతన్య సమంతలలో ఎవరో ఒకరు స్పందిస్తే మాత్రమే ఈ వార్తల గురించి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సమంత నాగచైతన్య ఈ విధంగా అయినా కలిస్తే బాగుంటుందని మరి కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ విషయంలో హ్యాపీగా లేరు.
బంగార్రాజు మూవీ వరకు నాగచైతన్య కెరీర్ సాఫీగానే సాగినా ఆ తర్వాత నుంచి చైతన్యకు వరుస షాకులు తగులుతున్నాయి.చైతన్య నటించి ఈ ఏడాది విడుదలైన థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లను సాధించలేదు.
లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ పెరుగుతుందని భావించిన నాగచైతన్యకు నిరాశజనకమైన ఫలితాలు ఎదురు కావడం గమనార్హం.ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నటిస్తున్న నాగచైతన్య పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి ఉన్నా ఆ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో స్పష్టత లేదు.సర్కారు వారి పాట ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో చైతన్య నిర్ణయం మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.