ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు గర్భధారణ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో రసానిక ఎరువులు వాడే ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకొని తినకుండా బయటి ఆహార పదార్థాలకు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ లపై ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
పెళ్లినా ప్రతి మహిళ కూడా గర్భం దాల్చాలి అని అనుకుంటూ ఉంటుంది.సాధారణంగా ప్రెగ్నెన్సీ మహిళలు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.తినే విషయంలో, కూర్చునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అదేవిధంగా ఎలాంటి ఆహారాలు తినాలో అనే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కానీ కొంతమంది గర్భిణీ స్త్రీలకు రకరకాల ఆహార పదార్థాలను తినాలని కోరిక ఉంటుంది.అలా తింటే కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా కొన్ని రకాల పండ్లను తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.
అలాంటి పండ్లు ఏవో తెలుసుకొని వారికి దూరంగా ఉండటమే గర్భవతులకు మంచిది.
గర్భం దాల్చినప్పుడు మహిళలు పైనాపిల్ ను తినకూడదు.ఎందుకంటే పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్, ప్రోటీన్లను విచినం చేసి గర్భాశయాన్ని మృదువుగా మార్చడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.
అలాగే గర్భధారణ సమయంలో ఎక్కువగా చింతపండును తినడం కూడా గర్భ స్రావం అయ్యే అవకాశం ఉంది.
గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ఆరు నెలలు చింతపండును తినకపోవడమే మంచిది.బొప్పాయిని గర్భిణి స్త్రీలు అస్సలు తినకూడదు.బొప్పాయిని తినడం వల్ల గర్భస్రావం కూడా అవుతుంది.
గర్భధారణ సమయంలో పుచ్చకాయను తినడం వల్ల కడుపు లోని బిడ్డకు పుచ్చకాయ నుంచి బయటకు వచ్చే విష పదార్థాలు హాని చేసే అవకాశం ఉంది.అలాగే గర్భిణీ స్త్రీలు ఖర్జూరాన్ని కూడా తినకూడదు.