బ్రిటన్ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భారత సంతతి ఆర్ధికవేత్తకు కీలక పదవి..!!

భారత సంతతికి చెందిన ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్, పీర్ జితేష్ గాధియా బ్రిటన్ కేంద్ర బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌లో నియమితులైనట్లు యూకే ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.జితేష్‌కు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పాతికేళ్ల అనుభవం వుంది.

 Indian-origin Peer And Finance Professional Jitesh Gadhia Appointed To Bank Of E-TeluguStop.com

ఆయనతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌లో మరో ఇద్దరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు (NED)లకు కూడా స్థానం కల్పించారు.వీరంతా వచ్చే నాలుగేళ్ల పాటు బ్యాంక్ కోర్టులో విధులు నిర్వర్తిస్తారు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వ్యూహాలు, ప్రణాళికలు, బడ్జెట్‌ను ఖరారు చేయడం , వనరులు, నియామకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఈ పాలకమండలిదే.కోర్టులోని సభ్యులందరినీ బ్రిటీష్ ప్రధాన మంత్రి, ట్రెజరీ ఛాన్సలర్‌ సిఫార్స్‌పై రాయల్ ఫ్యామిలీ నియమిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ప్రతిభపైనే అన్ని నియామకాలు జరుగుతాయి.ఎంపిక ప్రక్రియలో రాజకీయ నాయకులకు ఎలాంటి పాత్రా వుండదు.

Telugu Bank England, Bhagavad Gita, England, Jitesh Gadhia, Sabine Chalmers, Tom

గాధియా ఇప్పటికే బ్లాక్‌స్టోన్, బార్కలేస్ క్యాపిటల్, ఏబీఎన్ ఏఎంఆర్‌వో, బేరింగ్ బ్రదర్స్ వంటి సంస్థల్లో సీనియర్ ఫైనాన్స్ పదవుల్లో వున్నారు.ఆయన ప్రస్తుతం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్, టేలర్ వింపే, కంపెర్ ది మార్కెట్ లిమిటెడ్ బోర్డులలోనూ పనిచేస్తున్నారు.గతంలో యూకే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (యూకేఎఫ్ఐ), యూకే గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (యూకేజీఐ) బోర్డులలోనూ పనిచేశారు.

Telugu Bank England, Bhagavad Gita, England, Jitesh Gadhia, Sabine Chalmers, Tom

2016లో.బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అతి పిన్న వయస్కుడైన పీర్‌గా ఎన్నికై రికార్డుల్లోకెక్కారు.అంతేకాదు.

భారతీయుల పవిత్ర గ్రంథం ‘భగవద్గీత’పై ప్రమాణం చేసి ఆశ్చర్చపరిచారు.అలాగే కింగ్ ఛార్లెస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా వున్నప్పుడు బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్, సౌత్ ఆసియా ఫోకస్డ్ ఛారిటీకి కూడా అత్యక్షత వహించారు గాధియా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube