సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, హార్మోన్ చేంజెస్, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం తదితర అంశాలు హెయిర్ ఫాల్ కి కారణం అవుతుంటాయి.
ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.అయితే ఒక్కోసారి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా హెయిర్ ఫాల్ అనేది అదుపులోకి రాదు.
దాంతో ఏం చేయాలో అర్థం కాక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ హెయిర్ ఆయిల్ ను వాడితే కనుక జుట్టు రాలమన్నా రాలదు.
అవును ఈ హెయిర్ ఆయిల్ జుట్టు కుదళ్లను బలోపేతం చేసి రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది.అలాగే జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె, అరకప్పు ఆముదం, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ వేసి కలపాలి.ఈ గిన్నెను స్టవ్ పై పది నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రోజంతా వదిలేయాలి.వరుసటి రోజు పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసే మ్యాజికల్ ఆయిల్ సిద్ధం అయినట్టే.
ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను తలకు పట్టించి కాసేపు సున్నితంగా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు కనుక ఇలా చేస్తే హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.అలాగే జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా సైతం పెరుగుతుంది.