ఒక సినిమా తీస్తున్నారు అంటే అందులో ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు అనేక ఇతర పాత్రలను సైతం సృష్టించాల్సి ఉంటుంది.అయితే కొన్ని సార్లు అవసరమైన పాత్రలు సృష్టించడం ఎంత ముఖ్యమో అనవసరమైన పాత్రలను తగ్గించడం అంతే ముఖ్యం.
భారీ తారాగణం ఉంటే ఆ సినిమాను డిస్ట్రిబ్యూటర్ కొంటాడనే నమ్మకం తో చాలా సార్లు పెద్ద నటులను చిన్న పాత్రల కోసం పెట్టుకుంటు ఉంటారు.అయితే కొంత మంది నటులు అవి చేయడానికి ఒప్పుకోరు.
ఉదాహరణకు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం ముందుగా నటి సుధ ను సంప్రదించారట.కానీ అ పాత్రకు రెండు డైలాగులు లేకుండా సెట్ ప్రాపర్టీగా ఉండడానికి అమే ఒప్పుకోకపోవడంతో తమిళ మాజీ హీరోయిన్ సుకన్య ను ఆ పాత్ర కోసం పెట్టుకున్నారు.
సినిమా విడుదలైన తర్వాత చూస్తే నిజంగానే ఆ పాత్రకి అస్సలు స్కోప్ లేదు.
ఇక బాహుబలి సినిమాలో సైతం నాజర్ నటించిన బిజ్జల దేవుడి పాత్ర ఉన్న,లేకపోయినా పెద్దగా మార్పు ఏమీ ఉండదు.
కానీ ఆ పాత్ర అంటే రాజమౌళి కి విపరీతమైన ఇష్టమట.దాంతో ఒక దర్శకుడు ఒక టాలెంట్ ఉన్న నటుడు కలిసి ఆ పాత్రకు ప్రాణం పోశారు.
నాజర్ నటన తో బాహుబలి సినిమాకే బిజ్జల దేవుడి పాత్ర అందం తెచ్చింది.ఇలా ఏ ఒక్కసారి కాదు అనేక సార్లు జరుగుతూ ఉంటుంది. ఢీ సినిమాలో శ్రీహరి బార్య గా హీరోయిన్ ప్రేమ నటించింది.ఒకటి రెండు సార్లు కనిపించి రెండు డైలాగ్స్ చెప్తుంది.
అమే పాత్ర లేకపోయినా ఆ సినిమా హిట్ అయ్యేది అని చూసిన వారికి అనిపిస్తుంది.హాస్యనటులకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆమెకు ఈ సినిమాలో ఇవ్వలేదు.
నాటి రోజుల్లో బాలచందర్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎంత చిన్న పాత్ర అయిన సరే దాని రీజన్ దానికి ఉంటుంది.
ఉదాహరణకు అంతులేని కథ సినిమా విషయానికి వేస్తే బస్ కండక్టర్ పాత్ర కేవలం రెండు మూడు సార్లు కనిపిస్తుంది.కానీ చాలా మందికి ఆ పాత్ర గుర్తుంటుంది.ఇదే సినిమాను కన్నడలో సుహాసిని చేత చేపించగా, కండక్టర్ పాత్ర లో కమల్ హాసన్ నటించాడు.
ఇక తెలుగులో కాస్తో కూస్తో ఆ పాటి ఎమోషన్స్ ప్రతి పాత్ర చేత పలికించే దర్శకుడు పూరి. ఆయన తీసిన మురారి, నిన్నే పెళ్ళడతా సినిమాల్లో భారీ తారాగణం ఉన్నప్పటికీ ప్రతి పాత్ర ఒక ముఖ్యమైన కారణాన్ని కలిగి ఉంటుంది.