iPhone కొనుక్కోవడం అనేది నేటి యువత డ్రీం.వినియోగదారుల టెస్ట్ కి తగ్గట్టు ఆపిల్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో iPhoneని మరింత ముందుకు తీసుకెళుతోంది.
ఇకపోతే జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన iOS 16 ఓఎస్ ఇటీవలే రిలీజ్ అయ్యి, సూపర్ సక్సెస్ అయ్యింది.కాగా ఈ OS అప్‌డేట్ ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను మీముందుకు తీసుకు వచ్చింది.
ఐఫోన్లలోని తాజాగా చెప్పుకోదగ్గ ఫీచర్ ఏదన్నా వుంది అంటే వెదర్ యాప్ అవును, దానికి సంబంధించి అప్‌డేట్స్ తీసుకొచ్చింది.
ఇక వెదర్ యాప్‌లో 10-డేస్ ఫోర్‌క్యాస్ట్, ఎయిర్ క్వాలిటీ, డైలీ టెంపరేచర్, ప్రెసిపిటేషన్, UV ఇండెక్స్ వంటి చాలా ఫీచర్లు వున్నాయి.
ప్రెసిపిటేషన్ అంటేవర్షం, మంచు లేదా వడగళ్లు లాంటి వర్షం పడే పరిస్థితి అన్నమాట.ఈ ప్రెసిపిటేషన్ మాడ్యూల్ ద్వారా యూజర్లు తమ ప్రాంతంలో ఎలాంటి భయానక వర్షం కురుస్తోందో తెలుసుకోవచ్చు.
అలాగే వర్షం రాకను ముందుగానే గుర్తించి.బయటికి వెళ్లాలా? వద్దా? అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ వివిధ ప్రాంతాలవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా ఫారిన్ కంట్రీలో వున్నవారికి ఇది చాలా ఉపయోగం.ఇండియా సమశీతోష్ణ ప్రాంతం కనుక ఇక్కడ అంతగా అవసరం లేదు.కానీ US UKలో నివసిస్తున్న ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగం.అలాగే ఇండియాలో నేడు ఊహించని సమయంలో వర్షాలు కురుస్తున్నాయి.అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ముందుగానే వర్షాన్ని పసిగట్ట గల వెసులుబాటును ఈ ఫీచర్స్ ఉపయోగపడతాయి.
ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వెదర్ ఫోర్‌క్యాస్ట్, ప్రెసిపిటేషన్ గురించి తెలుసుకోవచ్చు.