ఏపీకి నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్.. కాంగ్రెస్ నేత తీవ్ర ఆరోపణలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏపీకి నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్ అని ఆరోపించారు.

 Ap's Number One Traitor Is Kcr.. Congress Leader Makes Serious Allegations-TeluguStop.com

ఏపీ ప్రజల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు.రాష్ట్ర విభజన తర్వాత కూడా కేసీఆర్ విషం కక్కారని మండిపడ్డారు.

ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికీ అభ్యంతరాలు చెబుతున్నారని తెలిపారు.అనుమతులు లేకుండా కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మించి ఏపీకి నీళ్లు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ తప్పదని ఎద్దేవా చేశారు.అదేవిధంగా ఏపీలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేస్తామని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube