జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ యాత్ర వాయిదా పడింది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5 నుంచి బస్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
కానీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యాత్ర విషయంలో కొంతకాలం వేచి చూడాలని జనసేనాని నిర్ణయించారు.
మరోవైపు జనసేనకు ఆదరణ పెరుగుతుందని సర్వేల్లో తేలిందని పవన్ వెల్లడించారు.
ఈ క్రమంలో వైసీపీ ఈసారి 45 నుంచి 67 స్థానాలకు పడిపోయే అవకాశం ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలోనే మరింత సన్నద్ధతతో యాత్రను చేపడతామని పవన్ స్పష్టం చేశారు.