రోజురోజుకూ టెక్నాలజీ మరింత అధునాతనంగా మారుతోంది.ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో ఎవరి ఊహకి అందని పనులు కూడా చేయడం సాధ్యమవుతోంది.
అయితే తాజాగా యాపిల్ కంపెనీ మన కంటికి కనిపించని వాటిని చూడగలిగే మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను తీసుకు రావడానికి సిద్ధమయ్యింది.సాధారణంగా మనకి వాయువులు కనిపించవు.
ఇంకా మన వాతావరణంలో ఉన్న చాలా వస్తువులు, వాయువులను కూడా మనం చూడలేము.వాటిని చూసేందుకు వీలుగా మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను యాపిల్ సంస్థ పరిచయం చేసేందుకు సిద్ధం అయ్యింది.
ఈ అప్‌కమింగ్ హెడ్‌సెట్‌తో గ్యాస్ లీక్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడవచ్చు.అంత స్పష్టంగా మన కంటి చూపును మారుస్తుందీ హెడ్‌సెట్.
ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత మౌంటబుల్ సిస్టమ్స్, ప్రొజెక్షన్-బేస్డ్ సిస్టమ్స్, హెడ్స్-అప్ డిస్‌ప్లేస్, వెహికల్ విండ్‌షీల్డ్స్ వంటి తదితర వాటికి అమర్చుకొని కంటిచూపును మరింత మెరుగుపరచుకోవచ్చు.ఫోన్ సిగ్నల్స్, వైఫై సిగ్నల్స్, ఇతర ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ కూడా ఈ హెడ్‌సెట్‌తో చూడచ్చని తెలుస్తోంది.
దీని మరో ప్రత్యేకత ఏమిటంటే ఒక వస్తువు ఉష్ణోగ్రత కూడా మనం చెక్ చేయవచ్చు.సౌండ్ వేవ్స్ ఎలా గాలిలో ప్రయాణిస్తున్నాయి కూడా వీక్షించవచ్చు.
ఒక్కమాటలో చెప్పాలంటే దీని సహాయంతో మన చుట్టూ ఉన్న అదృశ్య ప్రపంచాన్ని స్పష్టంగా చూస్తూ ఒక అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు.ఈ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ 2023 నాటికి మార్కెట్‌లోకి రిలీజ్ కావచ్చు.
ఈ హెడ్‌సెట్‌కు ‘యాపిల్ రియాలిటీ ప్రో‘ అని పేరు పెట్టినట్టు సమాచారం.ఈ హెడ్‌సెట్ అందుబాటులోకి వస్తే మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది.
ఈ హెడ్‌సెట్ మరొక ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది.అయితే దీని ధర ఎంత ఉంటుంది ? సామాన్యులు కూడా కొనుగోలు చేసేంత అందుబాటు ధరలతో దీనిని యాపిల్ తీసుకువస్తుందా? అనే విషయాలు ఇప్పటివరకైతే తెలియరాలేదు.