సౌత్ లో ప్రెజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు ఎస్ ఎస్ థమన్.భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటున్నారు.
ఈయన ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.ఈ మధ్యన మన తెలుగులో అఖండ, భీమ్లా నాయక్ సినిమాలు మ్యూజిక్ పరంగా బాగా ఆకట్టు కోవడంతో ఈయనకు అవకాశాలు బాగా వస్తున్నాయి.
ఇక ప్రెజెంట్ మెగా ఫ్యామిలీ చేస్తున్న రెండు సినిమాలకు ఏక కాలంలో సంగీతం అందిస్తున్నాడు.దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ రెండు సినిమాలపై చాలా ఆత్రుత కనబరుస్తున్నారు.
థమన్ మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాథర్ సినిమాతో పాటు రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ15 సినిమాకు ఏకకాలంలో పని చేసాడు.
తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను థమన్ అందించడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రియమైన రామ్ చరణ్ బ్రో #RC15 మరియు మెగాస్టార్ గాడ్ ఫాథర్ కోసం వర్క్ చేసిన అద్భుతమైన రోజు.లవ్ పీస్ అంటూ ఈయన ట్వీట్ చేసాడు.
థమన్ ఈ రెండు అప్డేట్ లను ఒకేసారి చెబుతూ రామ్ చరణ్ తో దిగిన ఫోటో మెగా ఫ్యాన్స్ ను ఆకట్టు కున్నప్పటికీ మరో విషయంలో వీరు ఆందోళన చెందుతున్నారు.వారి ఆందోళనకు కూడా కారణం లేకపోలేదు.ఇటీవలే గాడ్ ఫాథర్ టీజర్ రిలీజ్ చేయగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా మెగా ఫ్యాన్స్ ను ఆకట్టు దీంతో వీరు నిరాశ చెందారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో థమన్ ఏకకాలంలో పూర్తి చేస్తుండడంతో ఈయన వర్క్ క్వాలిటీ గా వస్తుందా ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి గాడ్ ఫాథర్ రిలీజ్ అయితే కానీ ఈ సినిమా ఎంత ఆకట్టుకుందో తెలుస్తుంది.ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక ఆర్సీ15 సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.