అక్కినేని హీరోల్లో నాగార్జున ఒకరు.ఈయన సీనియర్ హీరో అయినప్పటికీ తన కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు.
ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవలే బంగార్రాజు సినిమాను తన కొడుకుతో కలిసి చేసి హిట్ అందుకున్నాడు.
ఇక దసరా కు సోలోగా రాబోతున్నాడు.
ది ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ సినిమా కంటే ముందే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించాడు నాగార్జున.ఈ సినిమా ఈ నేలనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేవారు.
రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక నటించింది.
ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తుంది.అలాగే అగ్ర డైరెక్టర్ రాజమౌళి సైతం ఈ సినిమాలో భాగం అయ్యారు.
సౌత్ లోని నాలుగు భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఈయన కూడా భాగం అయ్యి సౌత్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సఫలం అయ్యాడు.అయితే ఈ రిజల్ట్ కోసం నాగార్జున కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.
ఇటీవలే నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.కానీ ఈయన సక్సెస్ కాలేక పోయాడు.ఇక త్వరలోనే అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంట్రీకి అయ్యాడు.అందుకే నాగార్జున ముందుగా బాలీవుడ్ లో హిట్ కొడితే చైతూ బాధ నుండి అక్కినేని ఫ్యాన్స్ బయట పడగలరు.
అలా కాకుండా బ్రహ్మాస్త్ర కూడా డిజాస్టర్ అయితే పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేము.