బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సీజన్లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మరుసటిరోజే బిగ్ బాస్ కంటెస్టెంట్లను క్లాస్, మాస్, ట్రాష్ అంటూ మూడు విభాగాలుగా విభజించారు.బిగ్ బాస్ అన్న తర్వాత టాస్కులు నామినేషన్లు ఎలిమినేషన్లు సర్వసాధారణం.
ఈ క్రమంలోనే మొదటివారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తికావడంతో ఈ నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
బిగ్ బాస్ నిర్వహించిన టాస్కులలో భాగంగా గీతు, నేహా,ఆదిరెడ్డి తమ ప్రతిభను చూపడంతో ఈ ముగ్గురు నామినేషన్స్ కి దూరంగా ఉండి కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడ్డారు.
ఇకపోతే ఈవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వాళ్లు నామినేట్ చేయాలనుకునే వారి పేర్లను పేపర్ పై రాసి టాయిలెట్ సీట్ లో వేయమని చెప్పారు.ఇలా టాయిలెట్ సీట్ లో ఎవరి పేర్లు అయితే ఎక్కువగా ఉంటాయో వారు నామినేషన్ లో ఉన్నట్టు అంటూ తెలిపారు.
ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా ఆరోహి, సత్య శ్రీ, ఫైమా, చలాకి చంటి, రేవంత్, అభినయశ్రీ, ఇయనా సుల్తానా,బాలాదిత్య మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు.అయితే ఈ నామినేషన్ లో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.ట్రాష్ క్యాటగిరిలో నామినేషన్ లో ఉన్నటువంటి బాలాదిత్య, అభినయ ఇయానా సుల్తానా ఈ ముగ్గురిలో ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని క్లాస్ విభాగంలో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు అవకాశం కల్పించారు.ఈ క్రమంలోనే బాలాదిత్యను సేవ్ చేయగా మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు.
ఇక నామినేషన్ లో ఉన్నటువంటి ఈ ఏడుగురిలో రేవంత్ చలాకి చంటి ఫైమా సేఫ్ జోన్ లో ఉండగా మిగిలిన నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారని మరి ఈ నలుగురిలో ఎవరు బయటకు వస్తారనేది తెలియాల్సింది.