సినిమా అంటే పిచ్చి… దర్శకత్వం చేయాలని బలమైన కోరిక… ఎలాగోలా ఇండస్ట్రీలోకి రావాలని తీవ్ర ఆశ.అప్పటికే తన బంధువు అయిన పూరి జగన్నాథ్ బాగా సెట్ అవ్వడంతో వెళ్ళగానే అవకాశం ఇస్తాడు అనుకుని 2002లో ఎంపీ పూర్తి చేసుకొని ఈ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు దర్శకుడు పరశురాం.
కానీ ఇండస్ట్రీ ఎవరికి ఎర్ర తివాచీ పరచదు అని రాగానే అర్దం అయ్యింది.హైదబాద్ చేరుకొని నేరుగా పూరి ఇంటికి వెళ్లిపోయాడు.
తన కోరిక ఏంటో పూరీకి చెప్పేసాడు.
కానీ పూరి అందుకు ఒప్పుకోలేదు సినిమా ఇండస్ట్రీ అంటే అంతా తేలికగా ఉందా, మర్యాదగా ఇంటికి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచేసాడు.
అలా పూరి కోపాన్ని గ్రహించి ఊరికి వెళ్లిపోయిన పరుశురాం అక్కడ ఉండలేకపోయాడు.మళ్ళీ సినిమా తప్ప ఇంకేమీ చెయ్యలేను అని నిర్ణయించుకొని పూరి దగ్గరికి వచ్చేసాడు.2002లో మొదటిసారిగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కోసం పనిచేయడం మొదలుపెట్టాడు.ఆ తర్వాత వీరు పోట్ల దగ్గర, బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర కొన్నాళ్లు పని చేశాడు.
ఇక 2008 లో తొలిసారి నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా యువత అనే సినిమాకి దర్శకత్వం చేశాడు.
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత రవితేజ హీరోగా ఆంజనేయులు సినిమా తీసి మరో మారు తన ఖాతాలో విజయాన్ని వేసుకున్నాడు.ఇక నారా రోహిత్ హీరోగా సోలో సినిమా చేయగా అది కూడా విమర్శకులను ఒప్పించింది.
రవితేజ తో మరోసారి సారొచ్చారు సినిమా తీయగా అది ఫ్లాప్ అయింది.
ఆ తర్వాత 2018 లో విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమా తీసి ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు దర్శకుడు పరశురాం. సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబుని కూడా డైరెక్ట్ చేసి టాలీవుడ్ లో తన స్టామినా ఏంటో చూపించుకున్నాడు.మరి అలాంటి పరుశురామ్ ఇంటికి వెళ్తే ఈరోజు ఏం అయ్యేవాడో కదా.!
.