ఇండస్ట్రీ మొత్తం ఒక దారి సురేష్‌ బాబుది మరో దారి!

టాలీవుడ్‌ మొత్తం కూడా ఒక దారి లో నడిస్తే సురేష్ బాబు మాత్రం మరో దారి అన్నట్లుగా మాట్లాడుతున్నాడట.ఇటీవల సినిమా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు భేటీ అయ్యి ఎనిమిది వారాల తర్వాత మాత్రమే సినిమా లను ఓటీటీ లో విడుదల చేయాలని నిర్ణయించారు.

 The Whole Industry Is One Way Suresh Babu Is Another Way, Dil Raju, Film News, O-TeluguStop.com

ఇప్పటికే కొన్ని అగ్రిమెంట్‌ అయితే ఏమో కాని ఆ తర్వాత నుండి ఏ సినిమా ను కూడా ఓటీటీ లో వెంటనే విడుదల చేయవద్దంటూ కఠిన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.ఈ నిర్ణయం పట్ల సురేష్ బాబు తీవ్ర అసంతృప్తి తో ఉన్నాడట.

సినిమా లు బాగుంటే మూడు నాలుగు వారాల్లోనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూస్తారు.కాని సినిమా బాగా లేకున్నా కూడా థియేటర్‌ కు వచ్చి చూడాల్సిందే అంటూ ఓటీటీ ని ఎనిమిది వారాలకు పెంచడం అవుతుంది అంటూ సురేష్ బాబు అభిప్రాయం గా సమాచారం అందుతోంది.

ఆయన బాహాటంగా వ్యాఖ్యలు చేయకున్నా కూడా ఇండస్ట్రీ లో కొందరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం తెగ చక్కర్లు కొడుతోంది.

నిర్మాతలకు ఓటీటీ అనేది చాలా పెద్ద ఉపశమనం.ఒక వేళ సినిమా ప్లాప్ అయితే వెంటనే ఓటీటీకి ఇవ్వడం వల్ల చాలా వరకు పెట్టుబడి వస్తుంది.

అలా కాదని ఎనిమిది వారాలకు సినిమా ను ఓటీటీకి ఇస్తే వారు ఇచ్చే మొత్తం నిర్మాతల నష్టం ను మరింతగా మిగల్చడం అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీ లో ఈ పరిస్థితి పై తీవ్రమైన చర్చ జరుగుతోంది.

సురేష్ బాబు చాలా సీనియర్ నిర్మాత.ఆయన నిర్ణయం కచ్చితంగా పాజిటివ్‌ గా ఉంటుంది.

నిర్మాతలు ఆయన మాట కూడా వింటే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube