నిన్న కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కావడంతో నందమూరి అభిమానులు ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడే మాటల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి క్లారిటీ ఇవ్వకపోయినా బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని తన స్పీచ్ ద్వారా వెల్లడించారు.
అదృష్టవశాత్తూ తాను బింబిసార మూవీని ముందే చూశానని తారక్ తెలిపారు.
దర్శకుడు మల్లిడి వశిష్ట్ బింబిసార కథను ఎంత బాగా చెప్పాడో అంతే బాగా తీశాడని తారక్ అన్నారు.బింబిసార సినిమాను చూసి నందమూరి అభిమానులు కచ్చితంగా కాలర్ ఎగరేస్తారని తారక్ చెప్పుకొచ్చారు.
బింబిసారకు ముందు బింబిసార తర్వాత అని చెప్పే విధంగా కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ ఉండనుందని తారక్ చెప్పుకొచ్చారు.
సినిమాలోని పాత్ర కోసం కళ్యాణ్ రామ్ రక్తం ధారబోశాడని తారక్ కామెంట్లు చేశారు.
అన్నయ్య కళ్యాణ్ రామ్ తప్ప మరెవరూ బింబిసార పాత్రను చేయలేరని తారక్ కామెంట్లు చేశారు.టెంపర్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా తన సినిమాలు ఉంటాయని చెప్పిన తారక్ అప్పటినుంచి వరుసగా విజయాలను సాధిస్తున్న సంగతి తెలిసిందే.
మంచి సినిమా తీస్తే జనాలు కచ్చితంగా థియేటర్లకు వస్తారని బింబిసార అలాంటి సినిమానే అని తారక్ కామెంట్లు చేశారు.వచ్చే నెల 5వ తేదీన బింబిసార సినిమాతో పాటు సీతారామం మూవీ థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని తారక్ చెప్పుకొచ్చారు.బింబిసార ఈవెంట్ లో తారక్ చేసిన కామెంట్లు ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేశాయి.