మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.సూపర్ హిట్ సినిమాలలో ఎన్నో మైలురాయి లాంటి సినిమాలు.
అలాంటి వాటిలో ఇంద్ర సినిమా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే.చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి.అయితే ఇటీవలే ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా విశేషాలను రచయిత నటుడు పరుచూరి గోపాలకృష్ణ అభిమానులతో పంచుకున్నారు.
ఇంద్ర సినిమాకు చిన్నికృష్ణ అందించిన కథ ఇక ఆ కథకు పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్ ఫుల్ డైలాగులు.దీనికి బి.గోపాల్ దర్శకత్వం తొడవ్వడం.ఇక చిరంజీవి నట విశ్వరూపం.
ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలు కూడా ఈ సినిమా విషయంలో గొప్పగానే జరిగాయి.అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
అయితే ముందుగా ఈ సినిమా కథని దర్శకుడు బి.గోపాల్ వద్దన్నాడట.దీనికి కారణం కూడా లేకపోలేదు.బి.గోపాల్ అంతకుముందు తెరకెక్కించిన నరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి రెండు సినిమాల్లో కూడా హీరో పాత్ర చిత్రీకరణ ఇంద్ర సినిమా లో ఉన్నట్లే ఉంటుంది.
దీంతో ఇక ఈ సినిమా కూడా అదే కథాంశంతో తెరకెక్కిస్తే ఫ్లాప్ భయపడ్డాడు దర్శకుడు బి.గోపాల్.ఆ సమయంలోనే చిరంజీవి గారు ఒక అద్భుతమైన సినిమా మిస్ అవుతున్నారు.
ఎలా అని ఎంతగానో బాధ పడ్డాను.ఈ విషయాన్ని చిరంజీవి కి చెప్పాను.అయితే వాళ్ళిద్దరూ లేకుండానే రేపు నాకు చిన్న కృష్ణతో కథ చెప్పండి అంటూ చిరంజీవి గారు చెప్పారు.ఇంటర్వెల్ వరకు కథ చెప్పగానే వెంటనే చిరంజీవిగారు కిళ్ళి వేసుకొని ఇక చెప్పాల్సిన అవసరం లేదు.
సినిమా హిట్ అవుతుంది అంటూ చెప్పారు.ఇంద్ర లో తనికెళ్ల భరణి పోషించిన పాత్ర ముందు నాకే వచ్చింది అంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
కానీ డైలాగ్ రైటర్ అయిన నేను మూగ పాత్రలో నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారో నేను పాత్ర వదులుకున్న అంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.