సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..ఈ పుట్టినరోజు ప్రత్యేకం అంటూ?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.

 Megastar Chiranjeevi Birthday Wishes To Hero Surya Details, Megastar Chiranjeevi-TeluguStop.com

ఈ విధంగా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సూర్య నేడు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు.జులై 23 ఈయన పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రముఖులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే ప్రతి ఏడాది మాదిరి కాకుండా ఈ ఏడాది సూర్యకు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి.ఈయన పుట్టినరోజు సందర్భంగా 68వ జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో భాగంగా నటుడు సూర్య నటించిన సూరారై పోట్రు చిత్రానికి గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడం విశేషం.

ఈ క్రమంలోనే ఈ పుట్టినరోజు సూర్యకు ఎంతో ప్రత్యేకం అయింది.ఇకపోతే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్యకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.నా ప్రియమైన హీరో సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నందుకు మీ ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం.హ్యాపీ బర్త్ డే మీకు మరెన్నో ప్రశంసలు రావాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ఈ సందర్భంగా సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఫోటో దగ్గర సూర్య దిగిన ఫోటోని షేర్ చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube