టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వేణు ఉడుగుల ఒకరు.ఇటీవలే ఈయన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల విరాట పర్వం సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.
నక్సల్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్న విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఈయన నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే వేణు తన తర్వాత సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించ బోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఇది హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనుందని వేణు చెప్పినట్టు టాక్ వచ్చింది.
అయితే హీరో ఎవరు అనేది బయటకు రాలేదు.
కానీ తాజాగా ఈ విషయం కూడా బయటకు వచ్చింది.
వేణు ఉడుగుల తన తర్వాత సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరోను పట్టినట్టు వార్తలు వస్తున్నాయి.జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న ధనుష్ కోలీవుడ్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.
ధనుష్ ప్రెసెంట్ డైరెక్ట్ తెలుగు సినిమాలతో రాబోతున్నాడు.డబ్బింగ్ సినిమాలతో వచ్చిన ఒకటి అరా మాత్రమే హిట్ అయ్యాయి.
ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.
ఈ సినిమా పట్టాలెక్కక ముందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.‘సార్‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.మరి ఈ రెండు సినిమాలు చేస్తూనే మరొక సినిమా లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.వేణు ఉడుగుల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రకటిస్తారని ఈ లోపు ఫైనల్ వర్షన్ వినాల్సి ఉందని తెలుస్తుంది.మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్.
చూడాలి ధనుష్ మూడవ సినిమా ప్రకటిస్తాడో లేదో.