అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ఔత్సాహికులు సైతం ఎదురు చూసారు.
మరి వారి ఎదురు చూపులకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది.నిన్న ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుకున్నారు.
ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.ఇది తనకు మొదటి డెబ్యూ సినిమా.ఈ సినిమా ఈ ఏడాది పెద్ద సినిమాల్లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాపై బాలీవుడ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది.
మరి ఈ సినిమాతో అమీర్ ఖాన్ తన కెరీర్ లో హిట్ కొడతాడో లేదో చూడాలి.
అమీర్ కూడా ఈ సినిమా హిట్ అవుతుంది అని ధీమాగా ఉన్నట్టు కనిపిస్తుంది.ఇక చైతూ ఉండడంతో మన తెలుగులో కూడా ఈ సినిమా చూడాలి అనే ఆసక్తి పెరిగింది.
అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు రెడీగా ఉంది.
ఇక తాజాగా అమీర్ ఖాన్ మెగాస్టార్ ఇంట్లో నాగ చైతన్య, రాజమౌళి, నాగార్జున, సుకుమార్ లకు ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూ ను వేసి చూపించాడు.ఈ క్రమంలోనే మెగాస్టార్ ఈ సినిమాపై తన స్పందన కూడా తెలిపాడు.ఈ పోస్ట్ తర్వాత మెగాస్టార్ మరొక మెగా అనౌన్స్ మెంట్ ఇచ్చి మెగా అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు.
ఈ సినిమాను తెలుగు వర్షన్ లో మెగాస్టార్ సమర్పణలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుగు పోస్టర్ ను షేర్ చేస్తూ చిరంజీవి తెలపడంతో మెగా ఫ్యాన్స్ అందరు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.ఈ సినిమాను తన సమర్పణలో ప్రెసెంట్ చేస్తున్నందుకు ఆనందంగా భావిస్తున్నానని.
డెఫినెట్ గా ఈ ఎమోషనల్ రైడ్ తెలుగు ఆడియెన్స్ ను కూడా మెప్పిస్తుందని చిరు ట్వీట్ చేసాడు.