ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, పవిత్ర లోకేష్ మధ్య వ్యవహారం గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ వ్యవహారంలోకి నరేష్ భార్య రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ భర్త సుచెంద్ర ప్రసాద్ ఎంటర్ కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది అని చెప్పాలి.
ఇక ఇటీవల ఏదైనా ఒక హోటల్ గదిలో నరేష్, పవిత్ర లోకేష్ ఉండడం అక్కడికి రమ్య రఘుపతి చేరి ఇక వీరిని చెప్పుతో కొట్టెందుకు ప్రయత్నించడం మరింత మరింత సంచలనంగా మారిపోయింది.అయితే ఈ వ్యవహారంపై నరేష్ చెల్లి పూజిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పై సంచలన ఆరోపణలు చేశారు పూజిత.నరేష్, రమ్య దంపతులకు పెళ్లి 10 ఏళ్ళు అయిందని అయితే బాబు పుట్టిన వెంటనే రమ్య గురించి అసలు నిజం తెలియడంతో అప్పటినుంచి విడిగా ఉంటున్నారని వీళ్ళు విడిపోయి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది అంటూ పూజిత చెప్పుకొచ్చింది.
రెండేళ్లకే నరేష్ రమ్య కనీసం అన్నం కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురి చేసిందని షాకింగ్ కామెంట్స్ చేసింది.రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చి అన్నం పెట్టమని అడిగితే.
నేను అందరిలా తలపై కొంగు వేసుకుని నువ్వు చెప్పినట్లు వినే అమ్మాయిని కాదు.ఈ తరం అమ్మాయి కనీసం అన్నం కూడా పెట్టలేదు అంటూ పూజిత చెప్పుకొచ్చింది.
ఇక నరేష్ ను అన్నివిధాల టార్చర్ పెట్టడం అతను విసిగిపోయి ఆమెకు దూరంగా ఉన్నాడు.నరేష్ తో పాటు నరేష్ ఇంట్లోనే ఉంటున్నాను అంటూ రమ్య చెబుతోంది.కానీ అదంతా అవాస్తవం నేను ఎన్నోసార్లు నరేష్ ఇంటికి వెళ్లాను.అక్కడ రమ్య ఎప్పుడూ కూడా కనిపించలేదు.విజయనిర్మల చనిపోయినప్పుడు కూడా ఒక పది నిమిషాలు మాత్రమే ఆమె ఆ ఇంట్లో ఉంది.ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఇక ఎన్నోసార్లు రమ్య విషయంలో ఓపిక పట్టిన నరేష్ విసిగిపోయి చివరకు దూరం పెట్టడంతో ఆమె చివరికి రమ్య తో తనకు సంబంధం లేదని నరేష్ చెప్పాల్సి వచ్చింది అంటూ పూజిత షాకింగ్ విషయాలు వెల్లడించింది.