నిన్ను డిస్ట్రబ్ చెయ్యడమే నా పని.. అనుపమ పరమేశ్వరన్ చాట్ వీడియో వైరల్!

ఈమధ్య సోషల్ మీడియాను నటీనటులు కూడా బాగా వాడుతున్నారు.ప్రతి ఒక్క విషయాన్ని సరదాగా షేర్ చేసుకుంటూ ఉంటారు.

 My Job Is Disturb You Anupama Parameswaran Chat Video Viral , Actress Anupama Pa-TeluguStop.com

అదే వేదికగా కొందరు సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.ఇదంతా పక్కన పెడితే.

హీరోయిన్లు మాత్రం ఫోటోషూట్ లతో, వ్లాగ్స్ తో బాగా సందడి చేస్తున్నారు.తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో అనుపమ ఒకరు.ఈమె ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో ఉంటుంది.

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికి పరిచయమే.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.

అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా ఓ పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది.అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు పొందుతూ ఉంటుంది.నిజానికి ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్ లు చేయడం చాలా తక్కువనే చెప్పాలి.

నాచురల్ గానే కనిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా తను చేసిన చాట్ వీడియో వైరల్ గా మారింది.

అందులో తను ఎక్కువగా డిస్టర్బ్ చేసే పర్సన్ ఎవరు అనడంతో. సారిక అక్క అని తనతో పదేపదే చేసిన మెసేజ్ లను చూపించింది.

ఇక ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube