ఇక నుంచి కొత్తగా ట్రైన్ టికెట్ల బుకింగ్‌ విధానం..

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌ని ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల కోసం టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను మార్చారు.ఐఆర్‌సీటీసీ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

 Follow These New Procedure To Book Train Tickets Details, Trains, Journey, Book-TeluguStop.com

ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు, ఇ-మెయిల్ ఐడీలను వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి చేసింది.వెరిఫికేషన్ లేకుండా కస్టమర్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.

కోవిడ్‌-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చేయని వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి.ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి మీరు ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడీనీ ఎలా ఎలా వెరిఫికేషన్ చేసుకోవచ్చో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేయడానికి ఫోన్ నంబర్‌లు, ఇ-మెయిల్ ఐడీలను ఇలా వెరిఫికేషన్ చేయించుకోండి.ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌కి వెళ్లండి.వెరిఫికేషన్ కోసం నేవిగేట్ విండో ఓపెన్ చేయండి.రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీనీ అక్కడ నమోదు చేయండి.

Telugu Indian Railway, Irctc, Irctc Website, Journey, Train Tickets, Trains-Late

మీకు కుడి వైపున వెరిఫికేషన్ కోసం ఒక ఎంపిక, ఎడమ వైపున ఎడిట్ బటన్ కనిపిస్తాయి.మీ వివరాలను నమోదు చేసిన తర్వాత, ధృవీకరణ కోసం మీరు మీ ఫోన్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీలో వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ని అందుకుంటారు.ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత మీరు ఇంతకు ముందు లాగానే ఐఆర్‌సీటీసీలో మీ మొబైల్ నంబర్, చిరునామాను వెరిఫై చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube