తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.
హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.లేడీ సూపర్ స్టార్ నయనతార యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమించుకున్న విషయం తెలిసిందే.
నయనతార, విఘ్నేష్ శివన్ నిన్న పెళ్లితో ఒక్కటయ్యారు.వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.వీరందరి మధ్య నయనతార కు విఘ్నేష్ చాలా సంతోషంగా తాళి కట్టి ఆమెను తనదానిని చేసుకున్నాడు.
నిన్న ఉదయం అభిమానుల అందరి కోరిక నెరవేరేంది.
తమ అభిమాన తార పెళ్లి విషయం ఎప్పుడు చెబుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చుసిన వారికీ నిన్న మర్చిపోలేని రోజుగా మిగిలింది.ఇక నిన్న వివాహబంధంలో అడుగుపెట్టిన కొత్త జంట ఈ రోజు తిరుమల తిరుపతి లో శ్రీవారిని దర్శించు కున్నారు.మొదటిసారి నయనతార తన భర్తతో కలిసి బయట కనిపించడంతో ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
దాంపత్య జీవితంలో అడుగు పెట్టిన వీరు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.స్వామి వారి కళ్యాణం తిలకించి అనంతరం శ్రీవారిని దర్శించు కున్నారు.ఆ తర్వాత ఆలయ అధికారులు వీరిని పట్టుబట్టలతో సత్కరించారు.కాగా నయనతార జంటను చూసేందుకు అక్కడి భక్తులు పోటీ పడ్డారు.వీరు తిరుమల శ్రీవారి సన్నిధిలో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.మరి ఆ ఫోటోలు మీకోసం.