ఆచార్య మూవీ ఆరో రోజు కలెక్షన్లు అంత తక్కువా.. కేజీఎఫ్2 కంటే దారుణంగా?

గత కొన్నేళ్లలో సినిమా టికెట్ రేట్లు ఊహించని స్థాయిలో పెరగడంతో ప్రేక్షకులు ప్రస్తుతం హిట్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు.ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఇప్పటికే థియేటర్ల సంఖ్య తగ్గిందనే సంగతి తెలిసిందే.

 Acharya Movie 6 Days Collections Details Here Goes Viral , Acharya , Kgf2 , Six-TeluguStop.com

రేపు మూడు క్రేజ్ ఉన్న సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఆచార్య మూవీ థియేటర్ల సంఖ్య మరింత తగ్గుతుండటం గమనార్హం.

అయితే ఎంత ఫ్లాప్ సినిమా అయినా స్టార్ హీరోల సినిమాలు రిలీజైన ఫస్ట్ వీక్ లో బాగానే కలెక్షన్లు సాధిస్తాయి.

అయితే ఆచార్య సినిమా ఆరో రోజున కేవలం 26 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.నిన్న కేజీఎఫ్2 55 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆర్ఆర్ఆర్ సినిమా 21 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఆచార్య మూవీ ఆరో రోజు కలెక్షన్లు చూసి మెగా ఫ్యాన్స్ షాకవుతున్నారు.

ఆచార్య సినిమాకు టాక్ మరీ దారుణంగా ఉండటం వల్లే ఈ విధంగా జరిగి ఉండవచ్చని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన చిరంజీవి కెరీర్ పై పూర్తిస్థాయిలో ప్రభావం పడుతుందని అనుకోలేమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి తర్వాత సినిమాలతో పవర్ చూపిస్తారని నెటిజన్లు భావిస్తున్నారు.

Telugu Acharya, Godfather, Kgf, Fans, Ticket Rates, Rrr, Sixth Day-Movie

గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ లో ఫ్లాప్స్ అనేవి సహజమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తర్వాత సినిమాతో నిజంగానే సత్తా చాటుతారేమో చూడాలి.లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube