ఆమె ఒక ఎస్సై.పెళ్లాడేందుకు నిశ్చితార్ధం కూడా జరిగింది.
అయితే డ్యూటీలో భాగంగా ఆమె కాబోయే భర్తని సైతం అరెస్ట్ చేసింది.అస్సాం లోని నాగోన్ జిల్లాలో సబ్ ఇన్ స్పెక్టర్ గా చేస్తున్న జున్మొని రభా, రాణా పగాగ్ ఓ.ఎన్.జి.సీలో ఉద్యోగాలు ఇప్పిస్తానటూ ప్రజల దగ్గర డబ్బుకు కాజేస్తున్నాడని సమాచారం అందింది.ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు చేసి వెంటనే అదుపులోకి తీసుకుంది.
అసోలోని ఓ.ఎన్.జి.సీలో తను పనిచేస్తున్నానటూ పగాగ్ అక్కడ వారికి చెప్పాడు.కంపెనీలో ఉద్యోగలు ఇప్పిస్తానని జనాలని నమ్మించి కోట్లాది రూపాయలు కొట్టేశాడు.
అంతేకాదు జున్మొని రభా వద్ద పీ.ఆర్.ఓ గా చేస్తున్నాని పరిచయాలు పెంచుకున్నాడని తెలిసింది.అయితే గతేడాది అక్టోబర్ లో రభాతో పగాగ్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు.ఈ నవంబర్ లో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు.అయితే పగాగ్ అసలు స్వరూపం తెలుసుకున్న ఆమె అతనితో పెళ్లి క్యాన్సల్ చేసుకోవడమే కాకుండా అతన్ని అరెస్ట్ చేసింది. నిందితుడు రాణా పగాగ్ గురించి తనకు సమాచారం అందించిన ముగ్గురు వ్యక్తులకు తాను రుణపడి ఉంటానని జుమోని రభా తెలిపారు.
కాబోయే వాడు ఎంతమోసగాడో వారి వల్లే తెలిసిందని ఆమె అన్నారు.