టిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడండి:- డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు

పేద‌ల‌కు మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురం, ముత్తారం, అమ్మపేట, నామవరం, తిమ్మినేనిపాలెంలో బహుజన రాజ్యాధికార యాత్ర 44వ రోజు కొనసాగింది.

 Bsp Leader Rs Praveen Kumar Fires On Kcr Government In Bahujana Rajyadhikara Yat-TeluguStop.com

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పలు సభలో ప్రవీణ్​కుమార్ ​మాట్లాడుతూ పేద‌ల‌కు ఉచిత విద్య‌,వైద్యం అందిస్తామ‌ని చెప్పి అంద‌లం ఎక్కిన కేసీఆర్ ఇప్పుడు వాటినే దూరం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వ ద‌వాఖానాలో అందాల్సిన వైద్య సేవ‌లు సకాలంలో అందక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

ప్రభుత్వ విద్య,వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉందని అన్నారు.

పేద విద్యార్థులు చదివే పాఠశాలలో పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని విమర్శించారు.దేశాన్ని పేదరికం నుంచి విముక్తి చేస్తానని అధికారంలోకి వచ్చినా ఆధిపత్య పార్టీలన్నీ గత 75 ఏళ్లుగా పేదల బతుకులు మార్చలేదని అన్నారు.

పేదల బతుకులు మార్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని అన్నారు.యువత మద్యం,గంజాయికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. 

Telugu Bc Sc St, Bsp, Cm Kcr, Kcr, Khamma, Telangana-Political

దేశ సంపదను అన్ని వర్గాల పేదలకు సమానంగా పంచాలన్నదే తమ లక్ష్యమన్నారు.బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ నిరంతరం పోరాడుతోందని చెప్పారు.రాజ్యాధికారం సాధిస్తేనే పేదల బతుకులు మారుతాయని వివరించారు.తెలంగాణ ఏర్పడినంక బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల బతుకులు మారలేదన్న ఆయన వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు.

అమ్మ పేటలో మద్యానికి బానిసై అనారోగ్యం పాలైన కుటుంబాలను పరిశీలించారు.పారిశుద్ధ్య పనులు చేసినా ఆయన తదనంతరం ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube