పెరిగిన ఆర్టీసి చార్జీల‌ను వివ‌రిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన..

వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో రెండో సారి పెరిగిన ఆర్టీసి చార్జీల‌ను వివ‌రిస్తూ మైలవరం నియోజ‌క‌వ‌ర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిరసన చేపట్టారు.ఆర్టీసి బస్సు లో ప్రయాణికులకు పెరిగిన చార్జీలు వివరించారు.

 Former Minister Devineni Uma Protest Against Increased Bus Charges Details, Form-TeluguStop.com

ఈ సందర్బంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రభుత్వ విధానాలపై మండి‌పడ్డారు డీజిల్ సెస్ తో ప్రజలకు 720 కోట్ల భారం మోపుతున్నారని పల్లె వెలుగు బస్సు ఛార్జీలు టిడిపి ప్రభుత్వం 7 రూపాయల నుంచి ఐదు రూపాయల తగ్గిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం పది రూపాయలు చేసి ప్రజల నడ్డి విరిచిందన్నారు.

జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యుడి వాహనం ధరలకు రెక్కలు వచ్చాయని విమర్శించారు.

ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం చేయలేని జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను గాలికి వదిలేశారన్నారు.ఆర్టీసీ విలీనం కాకుండా ఉద్యోగులు ప్రభుత్వం లో విలీనం అంటూ మాట మార్చారు మడమ తిప్పారన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube