పండుగరోజు పూజా కార్యక్రమాలతో వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్.. పవన్ పిక్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ఇటీవలే పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.

 Hariharaveeramallu Conducted Pooja Ceremony, Harihara Veeramallu , Pawan Kalyan,-TeluguStop.com

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇందులో రానా కూడా ప్రధాన పాత్రలో నటించాడు.

ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అందులో ‘హరి హర వీరమల్లు‘ సినిమా ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇప్పటి వరకు జరగలేదు.

పవన్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు.

Telugu Nidhi Agrawal, Pawan Kalyan, Sri Rama Navami-Movie

పూర్తిగా రాజకీయాలపైనే ద్రుష్టి పెట్టాడు.అయితే పవన్ మళ్ళీ ఫ్యాన్స్ కు శుభవార్త అందించాడు.ఈ రోజు శ్రీరామ నవమి పండుగ.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ పూజా చేసి స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఏ శ్రీరామ నవమి సందర్భంగా పూజా కార్యక్రమాలు చేసి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసారు.

పూజలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది.

Telugu Nidhi Agrawal, Pawan Kalyan, Sri Rama Navami-Movie

ఈ పూజా చేస్తున్న పవన్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.అలాగే ఈ రోజు పూజా తర్వాత ఈ సినిమా నుండి కొత్త పోస్టర్ ను 11.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.మరి కొత్త పోస్టర్ తో మేకర్స్ ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసారో చూడాలి.పవన్ ఇటీవల వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తుంటే మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు.

ఈయన లుక్ చూస్తుంటే మంచి యాక్షన్ సన్నివేసాలకు తనను తాను రెడీ చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు.ఇక ఇందులో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube